పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు, సచివాలయాలకు తాజా ఆదేశాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ 4 వేలు పెన్షన్ పంపిణీ చేస్తోంది. గతంలో ఉన్న వాలంటీర్ల స్థానంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తోంది. ప్రతీ నెలా సీఎం చంద్రబాబు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు పైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా.. ఈ నెల పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం జనవరి 1న పెన్షన్ పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1, 2026 బదులుగా డిసెంబర్ 31నే పింఛన్లు అందనున్నాయి. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 30 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ, ఏవైనా మిగిలిపోతే, ఆయా పింఛన్లను జనవరి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు పంపిణీ చేస్తుందని వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు రూ.4000 అందిస్తు్న్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.6000, పూర్తి వికలాంగులకు రూ.10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10000 ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్దారులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజునే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్దం అయిది. ఆ రోజున ఎవరికైనా అందక పోతే జవనరి 2న లబ్దిదారులకు అందించనున్నారు.
-
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!











Click it and Unblock the Notifications