వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ద‌సార‌ధి అసంతృప్తి..విప్ బాధ్య‌త‌ల‌కు స‌సేమిరా: మ‌రో ముగ్గురికి అవ‌కాశం: ఉత్త‌ర్వులు జారీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భ‌లో జ‌గ‌న్ కొత్త విప్‌ల‌ను నియ‌మించారు. నాలుగు రోజుల క్రితం నియ‌మించిన విప్‌ల్లో పార్ధసార‌ధి ఆ బాధ్య‌త లు స్వీక‌రించ‌టానికి నిరాక‌రించారు. మంత్రి ప‌దవి రాలేద‌నే అసంతృప్తితో ఉన్న పార్ధ‌సార‌ధి ఈ ప‌ద‌వి నిర్వ‌హించ‌టానికి సుముఖంగా లేరు. దీంతో..గ‌తంలో ప్ర‌క‌టించిన వారిలో ఆయ‌న మిగిలిన వారిని కొన‌సాగిస్తూ..కొత్త‌గా మ‌రో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఈ రోజు నుండి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతుండటంతో..వీరి నియామ‌కానికి సంబంధించి జీఏడీ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

లక్ష్మీపార్వతి, పూనం కౌర్ పై అసభ్య ప్రచారం చేసిన కోటి దొరికాడు.. కానీ .. పోలీసులు పట్టుకోలే! లక్ష్మీపార్వతి, పూనం కౌర్ పై అసభ్య ప్రచారం చేసిన కోటి దొరికాడు.. కానీ .. పోలీసులు పట్టుకోలే!

పార్ధ‌సార‌ధి నో...అదే కార‌ణం..
జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గ ఏర్పాటులో భాగంగా...ఈ నెల 8వ తేదీన కొత్త‌గా 25 మంది మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చే యించారు. ఆ మంత్రివ‌ర్గంలో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని భావించిన సీనియ‌ర్ నేత కృష్ణా జిల్లాకు చెందిన పార్ధ‌సార‌ధికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. కృష్ణా జిల్లా నుండి కాపు-క‌మ్మ‌-వైశ్య వ‌ర్గాల‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో ప్రాతినిధ్యం క‌ల్పించారు. అదే విధంగా పార్ధ‌సార‌ధి సామాజిక వ‌ర్గానికే చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు సైతం కేబినెట్‌లో బెర్త్ ఖ‌రారు అయింది. దీంతో..పార్ధ‌సార‌ధికి మంత్రి పద‌వి ఇవ్వ‌లేక పోవ‌టంతో..ఆయ‌న్ను అదే రోజు ప్ర‌భుత్వ విప్‌గా నియ మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, విప్ ప‌ద‌వి నిర్వ‌హించేందుకు పార్ధ‌సార‌ధి సుముఖంగా లేరు. ఇ దే విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేసారు. దీంతో..కొత్త‌గా మ‌రో ముగ్గురిని విప్‌లుగా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

AP Govt nominated one chief whip and seven whips... GAD issued order with these names

కొత్త‌గా మ‌రో ముగ్గురికి ఛాన్స్...
గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వులను స‌వర‌ణ చేస్తూ ప్ర‌భుత్వం విప్‌ల‌ను నియ‌మిస్తూ తాజా ఉత్వ‌ర్వులు జారీ చేసింది. దీని మేర‌కు చీఫ్ విప్‌గా శ్రీకాంత రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తారు. అదే విధంగా విప్‌లుగా బూడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రామ‌లింగేశ్వ‌ర రావు, చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి, సామినేని ఉద‌య‌భాను, కాపు రామ‌చంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు , గ‌తంలో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో చీఫ్ విప్‌గా ప‌ని చేసిన పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డికి ఇప్పుడు విప్‌గా అవ‌కాశం ఇచ్చారు. వీరిలో కొత్త‌గా సామినేని ఉద‌య‌భాను, కాపు రామ‌చంద్రారెడ్డి, పిన్నెళ్లి రామ‌కృష్ణా రెడ్డి పేర్ల‌ను జోడించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వారితో మాట్లాడిన త‌రువాత వారికి ఈ విప్ ప‌ద‌వులు కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. శాస‌న‌స‌భా స‌మావేశాలు ప్రారంభం కానుండ‌టంతో..ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

English summary
AP Govt nominated one chief whip and seven whips. GAD issued order with these names. Previously Pardhasaradhi included in this list..but, he not interest for Whip duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X