ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - మరో హామీ అమలు..!!
ఏపీ ప్రభుత్వం గ్రామాల్లోని ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి నుంచి గ్రామాల్లోనూ తమ ప్రతిష్ఠాత్మక పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో సంక్రాంతి వేళ ఈ నిర్ణయం అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది. దీని ద్వారా ఇప్పటి వరకు పట్టణ ప్రాంతానికే పరిమితం అయిన ఈ నిర్ణయం.. ఇక గ్రామాల్లోనూ అమలు కానుంది. దీంతో.. గతంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్న క్యాంటీన్లకు మంచి స్పందన వస్తోంది.

అల్పాహారమైనా, భోజనమైనా ఇక్కడ రూ.5కే అందిస్తున్నారు. అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారమైనా, మధ్యాహ్నం, రాత్రికి భోజనమైనా రూ.5కే ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించిన అన్న క్యాంటీన్లు, కొద్ది రోజుల్లోనే వారందరి ఆదరణను పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజక వర్గ, మండల కేంద్రాల్లో దాదాపు 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహా లు చేస్తోంది.
కాగా, వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో సుమారు 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. 2 లక్షల మందికిపైగా ప్రజలు ప్రతి రోజు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. పూటకు రూ.5కే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. పట్టణాలు, నగరాల్లో ప్రారంభించిన 205 క్యాంటీన్లలో ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications