పునర్వ్యవస్థీకరణ లో బిగ్ ట్విస్ట్ - అభ్యంతరాలతో కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసింది. రెవిన్యూ డివిజన్ లో మండలాల విలీనం పైనా నిర్ణయం తీసుకుంది. వీటి పైన గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కాగా.. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలతో పాటుగా ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు.. నిరసనల పైన ప్రభుత్వం నివేదిక కోరింది. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయంలో కొన్ని మార్పుల దిశగా రెవిన్యూ శాఖ సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ఆరు కొత్తగా రెవెన్యూ డివిజన్లు, ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునర్వ్యవస్థీకరణపై నెల రోజుల్లో ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాల కలెక్టర్లకు 500కుపైగా విన్నపాలు, అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఎక్కువ శాతం నెల్లూరు జిల్లా నుంచే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను పునర్వ్యవస్థీకరణలో తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లో విలీనం చేశారు. ఈ నిర్ణయాన్ని మూడు మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తమ మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వానికి వరసగా లేఖలు రాశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయుప్రసాద్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇంతలా నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఆ మండలాలను ఏ ప్రాతిపదికన తిరుపతిలో కలిపారన్న చర్చ మొదలైంది. దీంతో.. స్వయంగా సీఎం చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. వారి ఆందోళనకు కారణాలు, స్థానిక అంశాలు, ఇంకా రాజకీయ పరిస్థితులపై వేర్వేరు నివేదికలు తెప్పించుకున్నారు. ప్రజా స్పందనను పరిగణలోకి తీసుకుని, ఆ తిరుపతిజిల్లాలో విలీనం చేసిన ఆ మూడు మండలా ల ను తిరిగి నెల్లూరులోనే కొనసాగించాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో, ఈ నెల 28న జరిగే సమావేశంలో ఈ విషయంపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఇంకోవైపు.. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా 17 గ్రామాలతో పెద్దహరివాణం మండలాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద హరివాణం మండలం వద్దని, ఆదోనిలోనే కొనసాగించాల ని పలు గ్రామాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు రిలే నిరాహారదీక్షలు కూడా చేపట్టారు. తమ గ్రామాలను ఆదోనిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలపై రెవెన్యూ శాఖ కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ నెల 28న కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ భేటీలో చర్చించి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. ఆ తరువాత తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications