మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం, ఏం చేస్తున్నారని నిలదీసిన రైతులు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు.

గులాబీ బారిన పడి నాశనం అవుతున్న పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.

పోలీసులను పంపిస్తా: సీఎం రమేష్ కంపెనీపై బాబు తీవ్ర ఆగ్రహం, హెచ్చరిక

Bitter experience to Minister Somiredddy

ఈ సందర్భంగా మంత్రిని స్థానిక రైతులు నిలదీశారు. పురుగు మందుల కంపెనీలపై అధికారులకు ఏ మాత్రం నిఘా లేదని, ప్రభుత్వం పట్టించుకోవాలంటూ సోమిరెడ్డితో వాదనకు దిగారు.

రైతులను శాంతింపజేసేందుకు సోమిరెడ్డి ప్రయత్నించారు. నకిలీ పురుగు మందులు అమ్ముతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bitter experience to Andhra Pradesh minister Somireddy Chandramohan Reddy in Guntur district.
Please Wait while comments are loading...