కాణిపాకం ఆలయంలో బీజేపీ విష్ణువర్దన్ రెడ్డి సత్యప్రమాణం... ఎటువంటి అవినీతికి పాల్పడలేదని దైవ సాక్షిగా...
బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో సత్యదేవుడి ముందు ప్రమాణం చేశారు. 'ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాపై అవినీతి ఆరోపణలు చేశారు.. కానీ నేనెటువంటి అవినీతికి పాల్పడలేదు.అవన్నీ తప్పుడు ఆరోపణలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.' అని విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు. వేదపండితులు, బీజేపీ శ్రేణుల సమక్షంలో ఆయన సత్య ప్రమాణం చేశారు.
ఈ సందర్బంగా విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ... బాధ్యత గల వ్యక్తిగా 10 రోజుల్లో ప్రమాణం చేస్తానని చెప్పానని.. చెప్పిన మాట నిలబెట్టుకున్నానని అన్నారు. ఇప్పటివరకూ తాను ఏ ఆశ్రమం లేదా మఠాల నుంచి డబ్బులు ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదన్నారు. 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని పేర్కొన్నారు. సత్య ప్రమాణానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి కూడా ఆహ్వానం పలికానని... కానీ ఆయన రాలేదని అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు మహిళలకు గౌరవం ఇవ్వరని... వారిని అవమానపరిచేలా మాట్లాడుతారని అన్నారు.

రాచమల్లు లాగా తాను దిగజారుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదని విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. రాచమల్లుకు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేకపోవచ్చు.. కానీ తాను మాత్రం చెప్పిన ప్రకారం ఆలయానికి వచ్చి ప్రమాణం చేశానన్నారు.. రాచమల్లుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ దేవుడు ఇకనైనా మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.
కడప జిల్లా ప్రొద్దుటూర్‌లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై నెలకొన్న వివాదం విష్ణు వర్దన్ రెడ్డితో సత్య ప్రమాణం దాకా వెళ్లింది. టిప్పు సుల్తాన్ దేశ భక్తుడు అని రాచమల్లు,కాదు ఆయన దేశ ద్రోహి అని విష్ణు వర్దన్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య సవాళ్లు,ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది.
టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతించలేదని బీజేపీ నేతలు సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని కొద్దిరోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.విగ్రహం ఏర్పాటు కోసం కౌన్సిల్ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని, అనుమతి రాగానే ముందుకు వెళ్తామని స్పష్టం ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాము దేశద్రోహులు, మతోన్మాదుల విగ్రహాలేమీ పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడా? కాదా? అనేది రాజ్యాంగం, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్నారు.సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఇదే క్రమంలో విష్ణు వర్దన్ రెడ్డిపై రాచమల్లు అవినీతి ఆరోపణలు చేయగా... కాణిపాకం ఆలయంలో సత్యప్రమాణానికి సిద్ధమని విష్ణు ప్రకటించారు.ఈ సత్య ప్రమాణానికి తాను కూడా వస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాచమల్లు... ఇవాళ అక్కడికి వెళ్లలేదు.
కాగా,ఏపీలో గతంలోనూ పలువురు నేతలు ఇలా సత్య ప్రమాణాలు చేశారు.గతంలో అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుని సత్య ప్రమాణాలు దాకా వెళ్లారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో భార్యతో కలిసి వెళ్లి అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వామివారి ముందు సత్య ప్రమాణం చేశారు.దీంతో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా సతీసమేతంగా ఆలయానికి వెళ్లి లక్ష్మీ గణపతి ముందు సత్య ప్రమాణం చేశారు.
విశాఖ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన వెలగపూడి రామకృష్ణ... తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు స్థానిక సాయిబాబా ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు. విజసాయిరెడ్డి కూడా అక్కడికి రావాలని సవాల్ విసిరారు. అప్పట్లో ఈ వ్యవహారం విశాఖలో పొలిటికల్ హీట్ పెంచింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications