బజారు మనిషిలా.. ఒరేయ్ అంటే ఒసేయ్ అనలేమా? వాసిరెడ్డి పద్మపై బోండా ఉమ ఘాటువ్యాఖ్యలు
టిడిపి నేత బోండా ఉమ, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా విజయవాడ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన నేపథ్యంలో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు, బోండా ఉమ తదితరులు, అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన వాసిరెడ్డి పద్మతో వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ టీడీపీ అధినేత చంద్రబాబు, బోండా ఉమ లకు నోటీసులు జారీ చేసి కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన బోండా ఉమ
ఇక ఈ ఆదేశం తర్వాత కూడా బోండా ఉమా తీవ్రస్థాయిలో వాసిరెడ్డి పద్మ పై ఆరోపణలు చేశారు. ఆరోపణలకు ఎదురు దాడి చేసిన వాసిరెడ్డి పద్మ చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకుంటే చప్పట్లు కొడతామా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని తేల్చిచెప్పారు. ఇక ఇదే సమయంలో బోండా ఉమ పై తీవ్రస్థాయిలో వాసిరెడ్డి పద్మ విరుచుకుపడ్డారు.దీంతో వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన బోండా ఉమ తీవ్రస్థాయిలో ఆమెపై మండిపడ్డారు.

వాసిరెడ్డి పద్మ ఓ బజారు మనిషిలా మాట్లాడుతున్నారు
విజయవాడలోని టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బోండా ఉమా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై తూతూమంత్రంగా వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బోండా ఉమ మండిపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్న బోండా ఉమా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాసిరెడ్డి పద్మ ఓ బజారు మనిషిలా మాట్లాడుతున్నారని బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సంఘటన జరిగిన మూడు రోజుల వరకు ఇంట్లో మేకప్ వేసుకుని తిరిగారా?
నువ్వు అరేయ్ అంటే మేము ఒసేయ్ అనలేమా అంటూ బోండా ఉమా ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు లాగింది వాసిరెడ్డి పద్మ అని పేర్కొన్న బోండా ఉమా సంఘటన జరిగిన మూడు రోజుల వరకు ఇంట్లో మేకప్ వేసుకుని తిరిగారా అంటూ వాసిరెడ్డి పద్మను నిలదీశారు. చంద్రబాబు ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని బయటకు వచ్చారని మండిపడ్డారు. కాసు పత్రిక వచ్చే అబద్ధాలు చెప్పారు అంటూ విరుచుకుపడ్డారు.

వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వడానికి తాము వెళ్ళేది లేదు
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమకు నోటీసులు ఇచ్చారని బోండా ఉమా పేర్కొన్నారు. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వడానికి తాము వెళ్ళేది లేదని బోండా ఉమ తేల్చిచెప్పారు. ఈ నెల 27వ తేదీ లోపు అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని, దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని బోండా ఉమా పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండడం చంద్రబాబు చేసిన తప్పా అని నిలదీసిన బోండా ఉమ, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీరు హేయం అంటూ విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications