ఏం చేయాలో నాకు తెలుసు: పవన్‌కు బాబు కౌంటర్! కేవీపీ, వైసీపీలకు కూడా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన పైన, తమ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు, వైసీపీలకు బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన పైన, తమ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు, వైసీపీలకు బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు.
ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, అభివృద్ధి పైన కేవీపీ, పవన్, వైసిపి నేతలు టిడిపిపై భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో చంద్రబాబు వారికి సమాధానం ఇచ్చారు.
ఇటీవల పవన్ ఓ సభలో మాట్లాడుతూ అన్ని రకాలుగా లోపాలున్న ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు అంగీకరించారని చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీకి రావల్సిన వాటాను కవర్ కప్పి మనకు ఇచ్చిన దానిని ఏ రకంగా చంద్రబాబు మెచ్చుకున్నారని నిలదీశారు.

పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు పరోక్షంగా ఈ రోజు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాలంలో చాలా మంది ప్రత్యేక హోదా కావాలన్నారని, ఈ జిల్లాలో కూడా సభలు పెట్టి చెప్పారని, తనను కూడా విమర్శించారని, కానీ తాను కూడా విజ్ఞతతో ఆలోచించానని, తనకు అనుభవం ఉందని, ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని, తనను విమర్శించేవారికి అనుభవం లేదని, తాను కూడా కేంద్రంతో గొడవ పెట్టుకోవచ్చునని, అది నిముషం పని కాదని, కానీ గొడవల వల్ల ప్రయోజనం లేదని కౌంటర్ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టులో టిడిపి లేదా చంద్రబాబు పాత్ర ఏం లేదని కేవీపీ నిన్న అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టు జాతీయహోదా కాకుండా నాబార్డు ద్వారా మొదటి విడుత 1980 కోట్లు తీసుకోచ్చామంటే అది తన విజ్ఞత వల్లేనన్నారు.
వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పట్టిసీమకు, పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, కానీ టీడీపీకి ప్రాజెక్టుల పైన చిత్తశుద్ది లేదన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... చాలామంది తనను, పట్టిసీమను వ్యతిరేకించారన్నారు.
నిన్న జరిగిన సభలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడితే ఆయనను కూడా వైసీపీ నేతలు విమర్శించారన్నారు. పోలవరం వచ్చే లోపల పట్టిసీమ పూర్తి చేయకపోయింటే అనంతపురానికి తాగడానికి కూడా నీళ్లు వచ్చేవి కాదన్నారు. అలాగే, తనకు అనుభవం ఉందని, తనను విమర్శించే వారికి అనుభవం లేదని జగన్‌ను ఉద్దేశించి కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారని చెప్పవచ్చు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..!












Click it and Unblock the Notifications