వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండేళ్లకు టిడిపికి షాక్, ఎగరేసుకుపోయిన వైసిపి: బాబు సీరియస్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోంది. ఆ తర్వాత జరిగిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో, పురపాలక సంఘాలు, విజయవాడ నగర పాలక సంస్థలో టిడిపియే విజయం సాధించింది.

కానీ మెజార్టీ ఉన్న పెడన పురపాలక సంఘం పైన మాత్రం టిడిపి లెక్క తప్పింది. ఇక్కడ ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. టిడిపి పరాజయం నేపథ్యంలో చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇలా జరగడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలుస్తోంది.

పైగా, సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలోని పెడన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలలో వైసిపి గెలవడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. 2014కు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఆధిక్యం సాధించింది.

పెడన పురపాలకసంఘంలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. టిడిపికి 12, వైసిపికి 11 వార్డులు దక్కాయి. అప్పట్లో టిడిపి తరపున ఎర్రా శేషగిరిరావు ఛైర్మన్ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణంగా ఎర్రా శేషగిరిరావు గత ఏడాది మరణించారు.

దీంతో ఛైర్మన్ ఎన్నికకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఛైర్మన్ మరణంతో మునిసిపాలిటీలో టిడిపికి 11, వైసిపికి 11 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే టిడిపి ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పురపాలక సంఘంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.

Chandrababu very serious for lost pedana Municipality

ఆయనకు ఓటు హక్కు కూడా ఉండటంతో ఛైర్మన్ పదవిని సునాయాసంగా దక్కించుకోవచ్చునని టిడిపి భావించింది. పురపాలక సంఘం ఛైర్మన్ పదవికి గత నెల 29న ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, మంత్రి ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకల్ల నారాయణలకు బాధ్యత అప్పగించారు. మెజార్టీ ఉండటంతో టిడిపి నేతలు ధీమాగా ఉన్నారు.

కానీ, 29వ తేదీన పెడన పురపాలక సంఘంలో ఎన్నిక సమయంలో అంతా రివర్స్ అయింది. టిడిపి తరఫున పదిహేనవ వార్డు నుంచి ఎన్నికైన లంకె స్రవంతి.. వైసిపి ఛైర్మన్ అభ్యర్ధి బండారు ఆనంద ప్రసాద్‌కు మద్దతుగా చెయ్యి ఎత్తారు. ఊహించని పరిణామంతో టిడిపి నేతలు అవాక్కయ్యారు. ఆమెతో సీనియర్ నేతలు సంప్రదింపులు జరపకపోవడం కూడా ఈ సమస్య తెచ్చిందని అంటున్నారు.

ఆమె వైసిపికి అనుకూలంగా చేయి ఎత్తగానే.. సమావేశంలోనే ఉన్న ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్వయంగా వెళ్లి స్రవంతిని బతిమాలారు. కానీ ఫలితం కనిపించలేదు. చివరకు వైసిపి అభ్యర్ధి బండారు ఆనందప్రసాద్ ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో ఉన్న చంద్రబాబుకు ఈ సమాచారం చెప్పడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. పెడన మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నిక కూడా 29వ తేదీనే జరిగింది. ఆ పదవి కాస్తా వైసీపీ తన్నుకుపోయింది.

మండలంలో వైసీపీకి మెజారిటీ వున్న రీత్యా పోనీలే అని సరిపెట్టుకున్నారు. కానీ మెజారిటీ ఉన్న మునిసిపాలిటీలో కూడా టిడిపి పదవిని కోల్పోవడాన్ని జీర్ణంచుకోలేకపోతున్నారు. ఈ విషయమై సీరియస్‌గా ఉన్న చంద్రబాబు తాజా పరిణామాలపై పార్టీ పరంగా విచారణకు ఆదేశించారని తెలుస్తోంది.

కాగా, స్రవంతితో వైసిపి నేతలు ముందుగానే మాట్లాడుకున్నారని టిడిపి ఆరోపిస్తోంది. అదేం లేదని, తమను పట్టించుకోవడం లేదని స్రవంతి చెబుతున్నారు. మొత్తానికి అతివిశ్వాసానికి వెళ్లి బోర్లా పడ్డామని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
AP CM Chandrababu Naidu very serious for lost pedana Municipality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X