మెడపట్టి బయటకు గెంటేశారు, వచ్చేవారంలో టిడిపికి రాజీనామా: కవిత

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏలూరు: వచ్చే వారంలో టిడిపికి రాజీనామా చేయనున్నట్టు సినీ నటి కవిత ప్రకటించారు.ఇటీవలనే ఆమె బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. బిజెపిలో చేరేందుకు కవిత రంగం సిద్దం చేసుకొన్నారు. దీంతో టిడిపికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

జీవితకు చెక్: సినీ నటి కవిత బిజెపిలో చేరికకు రంగం సిద్దం

 Cine actress Kavitha will resign to TDP next week

టిడిపి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తే పార్టీలో తనకు గుర్తింపు లేకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటినట్లు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాలు తెలిసి కూడ టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు తనకు ఏమీ తెలియనట్టుగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వారికి కాకుండా భజనలు చేసే వారికే పార్టీలో గుర్తింపు, ప్రాధాన్యత దక్కుతున్నాయని ఆరోపించారు.

పదవులపై తనకు ఆశ లేదన్నారు. ఒక మహిళగా, సెలబ్రిటీగానూ గుర్తించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీలో తనకు తీవ్ర అవమానం జరిగిందన్నారు. దీంతో తాను తీవ్ర మనస్తాపం చెందానన్నారు. తాను చేరేందుకు అనేక .పార్టీలు సిద్దంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cine actress Kavith will resign to TDP next week. She spoke to media in Bayyannagudem village on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి