• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Visakha:జగన్ ఇక అగేది లేదు..విశాఖ నుండే జెండా-అజెండా : మూహూర్తం -వ్యూహం పక్కా : ఢిల్లీ నుండి క్లారిటీ..!!

By Lekhaka
|

నిర్ణయం తీసేసుకున్నాం. తగ్గేదే లే. ఇక..ముందుకే. మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి కీలక అడుగులు వేస్తున్నారు. రెండేళ్ల పాలన ముగించి..మూడో ఏట అడుగు పెట్టిన తరువాత ఒక పాలనా పరమైన నిర్ణయాలు ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు. అందులో భాగంగా..ఇంకా ఆలస్యం చేయకుండా విశాఖ నుండి పాలన ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే కొద్ది రోజులుగా పార్టీ నేతలు..మంత్రులు విశాఖ నుండి ఏ క్షణమైనా పాలన ప్రారంభమవుతోందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటన విషయంలోనూ తన ఆలోచన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందుంచినట్లు గా తెలుస్తోంది. అందులో భాగంగా న్యాయపరంగా చిక్కులు రాకుండా.. ఆచితూచి వ్యవహరిస్తూ నిర్ణయం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

 న్యాయపరంగా చిక్కులు రాకుండా..

న్యాయపరంగా చిక్కులు రాకుండా..

ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం పైన అనేక కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. కోర్టు అనుమతి లేకుండా కార్యాలయాలను తరలిస్తే వాటి ఏర్పాటు ఖర్చులను సంబంధితశాఖ ముఖ్య అధికారి నుంచి వసూలు చేస్తామని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు భయపడుతున్నారు. విశాఖలో ఇప్పుడే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తే న్యాయ పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..ముందుగా విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుండైనా పాలన చేయవచ్చని తాజాగా విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఇందులో భాగంగానే తెలుస్తోంది. సీఎం కార్యాలయం ఏర్పాటు తరువాత అనుబంధంగా కార్యాలయాలు ఒక్కోటి ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఎన్ని ఏర్పాటు చేయాలి, గుంటూరు, విజయవాడ నగరంతోపాటు తాడేపల్లి పరిధిలో ఉన్న కార్యాలయాల వివరాలన్నీ తీసుకున్నారు. సిబ్బంది మొత్తాన్ని ఎప్పట్లోపు అక్కడకు తరలించాల్సి వస్తుందనే అంశాలపై అన్ని శాఖల నుండి సమాచారం సేకరించారు.

 ముమూర్తం ఫిక్స్.. ఆ రోజున అక్కడే..

ముమూర్తం ఫిక్స్.. ఆ రోజున అక్కడే..

ముఖ్యమంత్రి విశాఖలో క్యాంపు కార్యాలయం..అక్కడి నుండే పాలన పైన జూలై 28న తొలుత ముహూర్తంగా ప్రచారం సాగింది. అయితే, ఆషాడ మాసం లో వెళ్లటం మంచిది కాదనే సూచనతో ముహూర్తం మార్చి నట్లు తెలుస్తోంది. దీంతో..తాజాగా ఆగస్టు 15న విశాఖ నుండి పాలన ప్రారంభించాలని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే రోజు విశాఖలోనే జాతీయ జెండా ఆవిష్కరించి..అక్కడి నుండే సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుండి పాలనా వ్యవహారాలు పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక నుండి కేబినెట్ సమావేశాలు..పాలనా పరమైన నిర్ణయాలు అక్కడి నుండే జరిగే అవకాశం కనిపిస్తోంది. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇదే సమయంలో కర్నూలు ను న్యాయ రాజధానిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ నుండి వేగంగా అనుమతులు.. హైకోర్టుతో సంప్రదింపులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో అమిత్ షా ను కోరారు. ఇక నుండి కేబినెట్ సమావేశాలు..పాలనా పరమైన నిర్ణయాలు అక్కడి నుండే జరిగే అవకాశం కనిపిస్తోంది. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

 విశాఖలో వడివడిగా అడుగులు...

విశాఖలో వడివడిగా అడుగులు...

విశాఖలో పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రోడ్ల విస్తరణ..విశాఖ డెవలప్ మెంట్..అక్కడ మౌళిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డి అక్కడే ఉంటూ అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న, ఇబ్బంది లేని స్థలాల్లో వెంటనే ఏదో ఒక నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. కోర్టులకు వెళ్లిన వాటిని వదిలేసి మిగిలిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న వాటిల్లో 110 ఎకరాలను మినహాయించి మిగిలిన వాటికి ఎటువంటి అభ్యంతరాలూ ఉండక పోవచ్చని రెవెన్యూ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి సమగ్ర నివేదికనూ విశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. వీటిల్లో ఎక్కడ వీలైతే అక్కడ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

  Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.
   కేంద్ర పెద్దలకు ఆహ్వానం..

  కేంద్ర పెద్దలకు ఆహ్వానం..

  ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుండి పాలన ప్రారంభానికి ప్రధాని..కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాజకీయంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైతే రాజకీయంగానూ వారికి సమాధానం చెప్పినట్లువుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. .అయితే, కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగా..ప్రభుత్వం తొందర పడటం మంచిది కాదనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఆగస్టు 15 ముహూర్తమే ఫైనల్ అని చెబుతున్న పరిస్థితుల్లో ఆ రోజున కేంద్ర పెద్దలను ఆహ్వానించినా వారు హాజరు అనుమానమే. ఎర్రకోట నుండి ప్రధాని జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఇక, మూడు రాజధానుల వ్యవహారంలో వేగంగా అడుగులు వేయటం ద్వారా టీడీపీ ఆత్మరక్షణలో పడుతుందని వైసీపీ అంచనా. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశం పైన అధికారిక ప్రకటన చేసిన తరువాత రాజకీయంగా ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది.

  English summary
  In a huge development in AP, CM Jagan had decided to move to Visakhapatnam on August 15th and start the administration from there.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X