వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంఓ ఆదేశాలా..డోన్ట్ కేర్: లైంగిక వేధింపుల కేసులో: తాడిపత్రిలో ఇలా..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ముఖ్యమంత్రి కార్యాలయ అదేశాలే అమలు కావటం లేదు. అధికారులు డోన్ట్ కేర్ అంటున్నారు. ఏపీ శాసనసభ దిశ చట్టం ఆమోదించి..ఇతర రాష్ట్రాల నుండి ప్రశంసలు అందుకుంది. కానీ, ఏపీలో మాత్రం అధికారులకు అవి పట్టటం లేదు. ఒక ఉపాధ్యాయుడు సహచర ఉపాధ్యాయులను లైంగికంగా వేధించిటం.. దీని పైన నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకొని సస్పెండ్ చేయాలని అదేశించారు. అయితే, ఇంత వరకు అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ కీచక ఉపాధ్యాయుడు తిరిగి విధుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇది తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారింది.

ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కు అదేశం..
తాడిపత్రి ప్రకాశం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నటరాజ్‌ తోటి ఉపాధ్యాయులను లైంగికంగా వేధించడం సంచలనమైంది. డిసెంబర్‌ 9న పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగికంగా వేధింపులపై కేసు రిజిష్టర్‌ అయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు ఈ ఉపాధ్యాయునిపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈ వ్యవహారం మీద నేరుగా సీఎం కార్యాలయం స్పందించింది. నటరాజ్‌పై చర్యలు తీసుకుని వెంటనే విధుల నుండి సస్పెన్షన్‌ చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు వెలువడినా స్థానిక మున్సిపల్‌ అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయటం లేదు. అప్పటి నుంచి మెడికల్‌ లీవుపై వెళ్లిన నటరాజ్‌.. ఉన్నట్లుండి తిరిగి విధులకు హాజరవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

CMO orders does not followed in sexual harassment case in tadipatri

ముందస్తు బెయిల్‌ పొంది...
సాధారణంగా మున్సిపల్‌ పరిధిలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు మెడికల్‌ లీవుపై వెళ్ళి వచ్చిన తరువాత తిరిగి తన విధుల్లోకి హాజరుకావాలంటే ముందుగా స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌కు తన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అందజేసి ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుని నుండి భాద్యతలను స్వీకరించాల్సి ఉంది. దీనికి విరుద్దంగా నటరాజ్ విధులకు హాజరయ్యారు. మున్సిల్‌ అధికారులు ప్రకాశం ఉన్నత పాఠశాలకు వెళ్ళి నటరాజ్‌ వ్యవహారంపై విచారణ జరిపి ఆర్డీకి నివేదికను అందజేశారు. కానీ ఇంత వరకు కీచకోపాధ్యాయునిపై శాఖాపరమైన చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ తీసుకొనే అవకాశం పోలీసుల ఉదాసీనత కారణంగానే కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

English summary
CMO orders does not implemented by Municipal officers in Tadiparti in sexual harasment teacher issue. against CMO suspension orders he rejoined in duty became hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X