వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనికరం లేకుండా కారు దించడానికి కారణం ఏంటి..? సీఎం జగన్‌ సాయిరెడ్డిల మధ్య దూరం పెరిగిందా?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏ రాజకీయ పార్టీలోనైనా అధినేత స్థానం రెండవ స్థానంలో ఓ కీలక వ్యక్తి చక్రం తిప్పడం సర్వ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ. ఇతర నేతలకు గాని కార్యకర్తలకు గాని పార్టీ అద్యక్షుడు నిత్యం అందుబాటులో ఉండలేడు కాబట్టి రెండవ స్థానంలో ఉన్న వ్యక్తే కీలక పాత్ర పోషింస్తుంటారు. ప్రతి జాతీయ పార్టీ నుండి ప్రాంతీయ పార్టీ వరకూ ఈ వ్యవహారం ఆచరణలో ఉంది. పార్టీకి సంబందించిన కీలక సమావేవాలు, సమావేశాలకు ఎవరిని ఆహ్వానించాలి, ప్రసంగాలు ఏవిధంగా ఇవ్వాలి, పార్టీ ఇతర నేతలను చేర్చుకోవడం, పార్టీ బలతోపేతానికి క్రింది స్దాయి నేతలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం రెండవ స్థానంలో ఉన్న నాయకుడు చూసుకోవడం సహజంగా జరిగిపోతుంది.

Recommended Video

CM Jagan Denies Entry To Vijay Sai Reddy In His Chopper , Is It True?

జగన్ ఆప్యాయతకు ఫ్యాన్స్ ఫిదా.. గ్యాస్ లీక్ బాధితుల పరామర్శలో అరుదైన సీన్స్...జగన్ ఆప్యాయతకు ఫ్యాన్స్ ఫిదా.. గ్యాస్ లీక్ బాధితుల పరామర్శలో అరుదైన సీన్స్...

విశాఖను విలవిలలాడిస్తున్న విషవాయువు.. విజయసాయిని దూరం పెట్టిన జగన్..

ఏపి అధికార వైసిపి పార్టీలో కూడా ఇదే వ్యవహారం నడుస్తోంది. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తర్వాత రెండవ స్థానాన్ని ఎంపి విజయసాయి రెడ్డి ఆక్రమించి పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తెన్నట్టు తెలుస్తోంది. కాగా పార్టీ అధినేత, రెండవ స్థానంలో ఉన్న నాయకుడు పార్టీకి రెండు కళ్లలా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేస్తుంటారు. అచ్చం ఇలాంటి పరిణామాలతో ముందుకెళ్తున్న వైయస్సార్ సీపీలో ఓ కుదుపు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో నంబర్ టూ గా ముద్ర వేసుకున్న విజయసాయి రెడ్డి వ్యవహారం పట్ల పార్టీ అధినేత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కష్టాల్లో, సుఖాల్లో వెన్నంటిపెట్టుకోవాల్సిన విజయసాయి రెడ్డిని జగన్ దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.

తెరపైకి వచ్చిన విభేదాలు.. సాయిరెడ్డికి ప్రాదాన్యత తగ్గించిన ఏపి సీఎం..

తెరపైకి వచ్చిన విభేదాలు.. సాయిరెడ్డికి ప్రాదాన్యత తగ్గించిన ఏపి సీఎం..

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెరవెనక అన్నీ తానై నడిపించడమే కాకుండా, జగన్ సుధీర్ఘ పాద యాత్ర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తగిన ప్రాధాన్యతనిచ్చారు. రాను రాను పార్టీ అధినేత పైనే ఆదిపత్యం చలాయించే దిశాగా విజయసాయి వ్యవహరిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అందుకు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి వ్యవహరించిన తీరే నిదర్శనమనే ఆధారాలు కూడా జగన్ ముందు ప్రత్యక్షమయ్యాయి. రెడ్ కార్పెట్ మీద నడవడం, పూల వర్షం కురిపించుకోవడవం, పాలాభిషేకం చేయించుకోవడం వంటి చర్యలు పార్టీ అద్యక్షస్ధానంలో ఉన్న నాయకుడికే సరిపడతాయి గాని రెండో స్థానంలో ఉన్న నేతకు ఏమాత్రం సరిపడవు.

ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డికి ఆధరణ.. వివాదాలకు కారణమైన పూల వర్షం..

ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డికి ఆధరణ.. వివాదాలకు కారణమైన పూల వర్షం..

ఒకవేళ అలా జరిగినా అది ఆదిపత్య పోరుకు దారితీస్తుంది తప్ప ఐకమత్యానికి కాదు. బహుషా ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డికి, విజయ సాయి రెడ్డికి విభేదాలు సృష్టించి ఉండి ఉండవచ్చనే చర్చ జరగుతోంది. వైయస్ కుటుంబం తనకు దైవంతో సమానమని చెప్పుకునే విజయసాయి రెడ్డి మొదట్లో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ చిత్రపటాలతో కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం కేవలం తన ఫొటోతో మాత్రమే వైజాగ్ లో విజయసాయిరెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ఆదిపత్యపోరుకు ఇదే నాంది పలికినట్టు చర్చ జరగుతోంది. అంతే కాకుండా కరోనా నేపథ్యంలో చేసిన ప్రభుత్వ సహాయాలను తన పేరుతో, తన సన్నిహితుడు స్థాపించిన ఫౌండేషన్ తో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి సునిశితంగా గమనించినట్టు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రతో పాటు గోదారి జిల్లాలపై సాయిరెడ్డి ప్రభావం.. కట్టడి చేయాలనుకుంటున్న అధిష్టానం...

ఉత్తరాంధ్రతో పాటు గోదారి జిల్లాలపై సాయిరెడ్డి ప్రభావం.. కట్టడి చేయాలనుకుంటున్న అధిష్టానం...

అంతే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలను మెల్లగా తన గుప్పిట్లోకి తీసుకున్నారు విజయసాయి రెడ్డి. సాయిరెడ్డి వ్యవహారాన్ని కొంతమంది పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోలేక భారతితో మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ ను రాజధాని చేయాలనే ఒత్తిడి కూడా విజయసాయి రెడ్డి చేసిందేనని చర్చ జరుగుతోంది. విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డికి మంచి పలుకుబడి ఉందని, రాజధాని అక్కడికి వెళ్తే పార్టీ పూర్తిగా తన చేతుల్లో ఉంటుందన్న భావనలో వైసీపి వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. భార్య భారతి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అనేక మార్లు హెచ్చరించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యతను తగ్గించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విశాఖను విషవాయువు విలవిలలాడిస్తున్నా విజయసాయిరెడ్డిని మాత్రం వెంటతీసుకెళ్లలేదు ఏపి సీఎం. దీంతో సీఎం సాయిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించారనే చర్చ కూడా జరుగుతోంది.

English summary
YSRCP sources say that Vijayasai Reddy has a good reputation in Uttarandhra along with Visakha city and that the party will be in its hands if the capital goes there. It seems that Jagan is planning to downplay the importance given to Vijayasair Reddy. There is also talk that CM has been reduced Sai Reddy's priority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X