వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వికారుద్దీన్‌ను దేవుడే శిక్షించాడు: కానిస్టేబుల్ భార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఉగ్రవాది వికారుద్దీన్‌ను ఆ దేవుడే శిక్షించాడని మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శాంతమ్మ అన్నారు. 2010లో తన భర్త రమేష్ హైదరాబాదులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో వికారుద్దీన్ తుపాకీతో కాల్చి చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్తను అకారణంగా చంపిన ఉగ్రవాది వికారుద్దీన్‌కు దేవుడే తగిన శిక్ష వేశాడన్నారు. ఇలాంటి ఉగ్రవాదనలు కాల్చి చంపడం సబబే అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామసముద్రానికి చెందిన యు రమేష్‌ కడప ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో పని చేసేవారు.

Constabla Ramesh wife responds on Vikaruddin's encounter

2010 మే 14న రమేశ్‌ను వికారుద్దీన్‌ కాల్చి చంపేశాడు. ప్రస్తుతం రామసముద్రం స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శాంతమ్మ వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ గురించి తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఆమె బంధువులు, స్నేహితులకు మిఠాయిలు పంచి పెట్టారు.

వికారుద్దీన్ మృతితో తన బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుందని హోంగార్డు బాలస్వామి తల్లి అన్నారు. 2009లో హైదరాబాదులో ఫలక్ నుమా వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విధుల్లో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన హోంగార్డు బాలస్వామి మృతి చెందారు. ఇప్పుడు వికారుద్దీన్ మృతిపై బాలస్వామి తల్లి బాలమ్మ పైవిధంగా స్పందించారు.

English summary
Constable Ramesh wife responds on Vikaruddin's encounter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X