కోవిడ్ ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త టైమింగ్స్ ఇవే- ఇవాళ్టి నుంచి మే 15 వరకూ
ఏపీలో నానాటికీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. కోవిడ్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే పలు పట్టణాలు,, నగరాల్లో వ్యాపార సంస్ధలు పనిచేసే సమయాల్ని కుదిస్తుండగా.. ఇప్పుడు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో సవరణలు చేస్తూ బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని బ్యాంకుల పని వేళల్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ కుదిస్తూ బ్యాంకర్ల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది కరోనా పీక్‌లో ఉన్న సమయంలో బ్యాంకులు తమ పని వేళల్ని ఇలా తగ్గించాయి. ఇప్పుడు మరోసారి సెకండ్‌వేవ్ ప్రభావం నేపథ్యంలో బ్యాంకులు మరోసారి అలాంటి నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.

ఏపీలో సవరించిన బ్యాంకుల సమయాలను ఇవాళ్టి నుంచి మే 15 వరకూ అమలు చేయాలని బ్యాంకర్ల కమిటీ మరో నిర్ణయం తీసుకుంది. మే 15 తర్వాత పరిస్ధితిని బట్టి ఈ నిర్ణయాన్ని సమీక్షించనున్నారు. అంటే దాదాపు మూడు వారాల పాటు సవరించిన సమయాల ప్రకారమే బ్యాంకులు పనిచేస్తాయి. దీంతో వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి బ్యాంకుల్లో లావాదేవీల్ని నిర్దేశిత సమయాల్లోనే పూర్తి చేసుకోవాలని రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి కోరారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications