విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవినేని నెహ్రూ మృతి: అవినాష్‌కు జగన్ ఫోన్, మోహన్ బాబు ఆవేదన

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు మోహన్ బాబు తదితరులు సంతాపం తెలియజేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు మోహన్ బాబు తదితరులు సంతాపం తెలియజేశారు.

వైయస్ జగన్ సోమవారం ఉదయం నెహ్రూ తనయుడు అవినాష్‌తో ఫోన్లో మాట్లాడారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు, తాను మంచి మిత్రుడిని కోల్పోయానని నటుడు మోహన్ బాబు అన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు.

<strong>దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర</strong>దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర

షిర్డీ సాయి బాబా.. దేవినేని నెహ్రూ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ, మరో నటుడు మంచు మనోజ్ తదితరులు సంతాపం తెలిపారు.

Devineni death: YS Jagan and Mohan Babu condolences

కాగా, గుండెపోటుతో మృతిచెందిన దేవినేని నెహ్రూ భౌతికకాయాన్ని విజయవాడకు తరలించారు. సోమవారం ఉదయం అయిదు గంటల ఇరవై నిమిషాలకు బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, టిడిపి నేతలు ఒక్కక్కరిగా ఆసుపత్రికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు.

సినీ నటుడు హరికృష్ణతో పాటు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఆస్పత్రికి చేరుకుని నెహ్రూతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం కేర్‌ ఆసుపత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో దేవినేని మృతదేహాన్ని విజయవాడకు తరలించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on monday called Devineni Avinash on phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X