తిరుమల ఘాట్ రోడ్ లో కారు పల్టీ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 78,974 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,995 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.61 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 25 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

భక్తుల రద్దీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తోన్న తమిళనాడుకు చెందిన శ్రీవారి భక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడమే ఈ ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
తమిళనాడు నుంచి వచ్చిన కారు (టీఎన్ 09 సీవీ 5519) అది. తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనానంతరం స్వస్థలానికి బయలుదేరారు. మొదటి ఘాట్ రోడ్డు మీద ప్రయాణిస్తోన్నప్పుడు అదుపు తప్పింది. రెండో కిలోమీటర్ మైలురాయి మలుపు వద్ద బోల్తా కొట్టింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ ను ఢీ కొట్టింది. రోడ్డుకు అడ్డుగా పడింది. అందులో ప్రయాణిస్తోన్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
కారు రోడ్డుకు అడ్డుగా పడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. కారును తొలగించారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
-
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్











Click it and Unblock the Notifications