గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40 రోజుల్లో 101 వెబ్‌సైట్ల రూపశిల్పి;అసాధారణ విజయాలు:కందిమళ్ల రజిత...దిగ్రేట్...

|
Google Oneindia TeluguNews

నలభై రోజుల్లోనే నూటొక్క వెబ్‌సైట్ల రూపకల్పన...వాటికి ఎన్నో అవార్డులు...సొంత స్టార్టప్ కంపెనీ ఏర్పాటు...దానికి సిఈవోగా బాధ్యతలు...వెబ్‌సైట్ల డిజైనింగ్‌ కోసం ప్రసిద్ధ సంస్థల నుంచి ఆఫర్ల వెల్లువ...ఇన్ని ఘనతలు సాధించింది ఒకే ఒక్కరు...ఆ ఒక్కరు ఎవరై ఉంటారు?...వారి బ్యాక్ గ్రౌండ్ ఏమై ఉంటుంది?...టెక్నాలజీలో ఇంత టాలెంట్ చూపిస్తున్నారంటే...ఖరీదైన కార్పొరేట్ స్కూళ్లలో చదివి, ఆ తరువాత ఫేమస్ ఇనిస్టిట్యూట్లలో ఐఐటి పూర్తి చేసిన ఏ హైటెక్ కుర్రాడో అయి ఉంటాడని ఎవరైనా ఊహిస్తారు...కానీ..

ఈ ఘనత సాధించింది మాత్రం...మారుమూల పల్లెలో... విద్యార్హతలు పెద్దగా లేని రైతు కుటుంబంలో పుట్టి, సాధికారత మీద మక్కువతో స్వయంకృషి చేసి అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు అడుగులేస్తున్న ఓ సామాన్య బి-టెక్‌ విద్యార్థిని...అంటే నమ్మగలరా?...మీరు నమ్మినా నమ్మక పోయినా ఇదే నిజం...తన ఆ అసాధారణ విజయాలతో గ్రామీణ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నఆ అమ్మాయి పేరు పేరు కందిమళ్ల రజిత... గుంటూరు జిల్లా పెట్లూరివారిపాలెం...

కందిమళ్ల రజిత...దిగ్రేట్...ఎందుకంటే?

కందిమళ్ల రజిత...దిగ్రేట్...ఎందుకంటే?

ముందుగా...కందిమళ్ల రజిత...దిగ్రేట్...ఎందుకంటే...కేవలం 40 రోజుల్లో 101 వెబ్‌సైట్లను రూపొందించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలివ్యక్తిగా రికార్డులకు ఎక్కడం...అందుకు...అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో ఆమె పేరు నమోదు కావడం...ఇటీవలే ఈ రికార్డు సాధించినందుకు రాష్ట్ర మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశంసలు అందుకుంది. అంతేకాదు...ఆ తరువాత ఆల్‌టెక్‌ ట్రెండ్‌ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి దినదినాభి వృద్ది చెయ్యడమే కాదు...అందులో తన సహచర విద్యార్థులనే 12మందిని ఉద్యోగులుగా నియామకం చేసుకుంది...ఆ సంస్థ ద్వారా అందరూ ఆదాయం ఆర్జించేలా చేస్తోంది.

కుటుంబం...నేపథ్యం...

కుటుంబం...నేపథ్యం...

మా ఊరు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం. మా నాన్న కందిమళ్ళ రాఘవయ్య, అమ్మ బాలకోటేశ్వరమ్మ. మేం నలుగురు పిల్లలం. మా అక్క నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ చేస్తోంది. నేను, నా కవల సోదరి రవళి అక్కడే బి.టెక్ ఫైనలియర్ చదువుతున్నాం. మాకు తొమ్మిదో తరగతి చదువుతున్న తమ్ముడున్నాడు. మాది సామాన్యమైన రైతు కుటుంబం. అయినా మా అందరినీ బాగా చదివించాలన్నది మా అమ్మా నాన్న కోరిక. జీవితంలో ఏదైనా సాధించాలన్నపట్టుదలతో ఉన్న నాకు అనుకోకుండా ఒక అవకాశం లభించింది...అదేమిటంటే...మా కాలేజీలో స్టార్టప్‌ విభాగం ఏర్పాటు కావడం!

సొంతంగా ఏదైనా చెయ్యాలని...బాసటగా నిలిచారు...

సొంతంగా ఏదైనా చెయ్యాలని...బాసటగా నిలిచారు...

సొంతంగా ఏదైనా చెయ్యాలనే నా తాపత్రయానికి స్టార్టప్‌ విభాగం బాసటగా నిలిచింది. ఆ విభాగానికి చెందిన మిట్టపల్లి సుహాసిని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దీంతో నేను వెబ్‌సైట్ల రూపకల్పన మీద దృష్టి పెట్టి వాటికి సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను. అయినా ఏదో సందిగ్ధం...ఆందోళన...ఎందుకంటే...ఒక వెబ్‌సైట్‌ రూపొందించాలంటే 5 వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది. డొమైన్‌, వెబ్‌ హోస్టింగ్‌లకు డబ్బు చెల్లించాలి. మరి అందుకు డబ్బు సమకూర్చుకోవడం ఎలా?..ఈ దశలోనే నాకు ‘వెబ్‌ 2.0' సంస్థ అండగా నిలబడింది. నేను రూపొందించే వెబ్‌సైట్లకు హోస్టింగ్‌, ప్రాసెసింగ్‌ ను ఉచితంగా అందజేసింది. డొమైన్‌ కూడా అలాగే ఉచితంగా పొందగలిగాను. దీంతో ఖర్చు నామమాత్రంగానే అయింది. ఇలా ఇప్పటివరకూ నేను వెబ్‌సైట్ల తయారీకి ఖర్చు పెట్టింది కేవలం 50 వేల రూపాయలే...

సొంత కంపెనీ...ఎందుకంటే...

సొంత కంపెనీ...ఎందుకంటే...

నేను మొదటి రెండు వెబ్‌సైట్లు తయారు చేసిన తరువాత...ఈ ప్రక్రియ అంతా సిస్టమేటిక్‌గా జరిగితే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. అలా ఆలోచన లోనుంచి పుట్టుకొచ్చిందే ‘ఆల్‌టెక్‌ ట్రెండ్‌'. నేను సిఇఓగా ఏడాది కిందట ఏర్పాటు చేసిన ఈ అంకురాభివృద్ధి సంస్థ(స్టార్టప్ కంపెని) బి.టెక్‌. థర్డియర్‌ పూర్తయ్యాక వేసవి సెలవుల్లో...ఇంట్లోనే వెబ్‌సైట్ల డిజైనింగ్‌ మీద దృష్టి సారించాను. నలభై రోజుల్లో నూటొక్క వెబ్‌సైట్లకు రూపకల్పన చేశాను...ఈ విషయం తెలిసి మా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.కె. వెంకటరావు ఈ సమాచారాన్నివండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు తెలియజేశారు. ఆ సంస్థ నిర్వాహకులు నా వెబ్‌ డిజైన్లను పరిశీలించి ఆ రికార్డుకు ఎంపిక చేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆ గుర్తింపు పత్రాన్ని అందుకోవడం ఎంతో సంతోషం కలిగించింది. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ గారు ప్రత్యేకంగా అభినందించడం ఒక మధురానుభూతి.

నేను తయారు చేసిన...వెబ్ సైట్ల గురించి...

నేను తయారు చేసిన...వెబ్ సైట్ల గురించి...

నేను ఎక్కువగా సర్వీస్ ఇండస్ట్రీకి ఉపయోగపడే వెబ్‌ సైట్లు తయారు చేశాను. అలాగే బిగ్‌డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, లాంగ్వేజెస్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, అప్లియేటెడ్‌ వెబ్‌సైట్లు, చదువుకు సంబంధించిన అంశాల్నివిద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే వెబ్‌సైట్లు కూడా వీటిలో ఉన్నాయి. వీటికి గూగుల్‌ సంస్థ నుంచి ప్రకటనల ద్వారా సపోర్ట్‌ లభిస్తోంది. మా ఆల్‌టెక్‌ ట్రెండ్‌ డాట్‌కామ్‌ ద్వారా వివిధ సంస్థలకు వెబ్‌ డిజైన్లు అందించాం. వీటిలో ‘హుకేష్‌ ఐటీ సొల్యూషన్స్‌'...అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సంస్థ. అతి త్వరలోనే వారి కార్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. దీంతో మా సంస్థకు మరిన్ని వెబ్‌సైట్ల తయారీకి ఆర్డర్లు ఈ సంస్థ నుంచి లభించే అవకాశం ఉంది.

మరింత అభివృద్ది...ఆర్డర్లు...

మరింత అభివృద్ది...ఆర్డర్లు...

అలాగే వీఎల్‌ సర్వీసెస్‌ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్ల మేరకు వెబ్‌ డిజైన్లు చేశాం. ఇంకా అనేక సంస్థలకు ప్రాజెక్టులు చేశాం. వెబ్‌సైట్లతో పాటు ఆండ్రాయిడ్‌ యాప్స్‌ రూపకల్పన, సియో ఇంజన్‌ సెర్చ్‌ ఆప్టిమైజేషన్‌లతోపాటు అఫ్లియేటెడ్‌ మార్కెటింగ్‌ మీద దృష్టి సారించాం. ఆండ్రాయిడ్‌ యాప్స్‌ కూడా ప్రాసెస్‌లో ఉన్నాయి.

 సమాజానికి ఉపయోగం...గ్రామీణులకు కూడా

సమాజానికి ఉపయోగం...గ్రామీణులకు కూడా

‘సమాజానికి ఉపయోగ పడేలా ఏదైనా చెయ్యాలి. అందరికీ అందుబాటులోకి వెబ్‌సైట్లు తేవాలి...ముఖ్యంగా గ్రామీణులకు అర్థమయ్యే రీతిలో వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్స్‌కు రూపకల్పన చెయ్యాలి'...ఇదీ నా లక్ష్యం!...ఎందుకంటే మాది కూడా గ్రామీణ ప్రాంతమే! అక్కడ ఉండేవాళ్ళ సమస్యలేమిటో నాకు తెలుసు...అంటోది ఈ గ్రేట్ యంగ్ టాలెంట్...అన్నిటికీ మించి...ఈ విద్యార్థిని గొప్పతనం ఏమిటంటే...అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని...అసాధారణ విజయాలు సాధించవచ్చని రుజువు చేసినందుకు...తద్వారా గ్రామీణ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలచినందుకు...అందుకే...మరోసారి..కందిమళ్ల రజిత...ది గ్రేట్..

English summary
An engineering student, belonging to a remote village with agriculture background in Guntur district, created 101 websites in 40 days and secured place in the Wonder Book of Records. K. Rajita, a fourth year B.Tech student of Narasaraopeta Engineering College, Narasaraopeta, created 101websites and started a web-designing startup, Altech Trend, a year ago. Rajita said she got training in web-designing as there was no guarantee about she being employed after completion of her degree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X