మాజీ ఎమ్మెల్యే కందికుంటకు ఐదేళ్ల జైలు

Subscribe to Oneindia Telugu

అమరావతి/అనంతపురం: నకిలీ డీడీలు సృష్టించిన కేసులో కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. మాజీ ఎమ్మెల్యేతో పాటు నకిలీ డీడీల సృష్టికి సహకరించిన ఎస్‌బీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ నర్సింగరావుకు ఐదేళ్లు, మాజీ ఎస్‌ఐ వెంకటమోహన్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

five years imprisonment for kandikunta prasad

ఉద్యోగుల 'చలో అసెంబ్లీ' భగ్నంఅమరావతి: తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అమరావతికి తరలివెళ్లేందుకు వచ్చిన ఉద్యోగులను విజయవాడలో బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో అడ్డుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనకు అనుమతి లేదంటూ జాక్టో, ఫ్యాప్టో నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five years imprisonment for Kadiri former MLA Kandikunta Prasad in fake DDs case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి