హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిద్ధయ్య కుమారుడి గుండెలో రంధ్రం, రెయిన్ బో వైద్యుల ఆపరేషన్ సక్సెస్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన సిద్ధయ్య కుమారుడి గుండెలో ఉన్న రంధ్రానికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు చిన్నారి అన్నవాహిక, వాయునాళాన్ని వైద్యులు విజయవంతంగా వేరు చేశారు.

నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎస్‌ఐ సిద్ధయ్య గాయపడటంతో హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను నిండు గర్భిణీగా ఉన్న ఆయన భార్య ధరణిష చూసేందుకు వచ్చి, తీవ్ర ఆవేదనతో పురిటినొప్పులకు గురి కావడంతో సిజేరియన్ ఆపరేషన్ చేశారు.

Hole in Si siddaiah son's heart

దీంతో ఎస్‌ఐ సిద్ధయ్య భార్య ధరణిష పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సిద్ధయ్య మరణ వార్తకు ముందు, ఆయన భార్య జన్మనిచ్చిన మగ బిడ్డ గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పాలు కూడా సరిగ్గా తాగకపోవడంతో మంగళవారం ఒక్కసారిగా సిద్ధయ్య కుమారుడి పరిస్ధితి ఆందోళనకరంగా మారింది.

దాంతో హుటాహుటిన మంగళవారం ఉదయం హుటాహుటిన ఉదయం 9.30 గంటలకు బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. సిద్ధయ్య కుమారుడికి కొద్ది సేపటి క్రితం రెయిన్ బో ఆసుపత్రిలో చేసిన ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు.

సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలుపాలై హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ని ఎస్‌ఐ సిద్ధయ్య మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
Hole in Si siddaiah son's heart.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X