వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్షరాస్యుల ఓట్లే చెల్లుబాటు కాలేదు: 10% ఓట్లు చెల్లు బాటు కాలేదు

విధ్యాధికులు కొందరైతే, భావి భారత పౌరులను తీర్చిదిద్దేవారు మరికొందరు. అయితే వారు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేకపోయారు. అక్షరాస్యులు తమ ఓటును సక్రమంగా వినియోగించుకొంటారు. ఓటును మురిగిపోకుండా న

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:విధ్యాధికులు కొందరైతే, భావి భారత పౌరులను తీర్చిదిద్దేవారు మరికొందరు. అయితే వారు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేకపోయారు. అక్షరాస్యులు తమ ఓటును సక్రమంగా వినియోగించుకొంటారు. ఓటును మురిగిపోకుండా నిరక్షరాస్యులు వ్యవహరిస్తారు.గ్రాడ్యుయేట్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు 10 శాతం ఓట్లు చెల్లుబాటు కాలేదు.

అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే తాము ఎవరికి ఓటు చేయాలో వారికి సక్రమంగా ఓటు చేస్తారు.అయితే పోలింగ్ తేదినాటికి నిరక్షరాస్యులు ఓటింగ్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.

గ్రామంలో ఉండి కూడ ఓటు చేయకపోతే చనిపోయామనే భావనతో ఉంటారు.అందుకే ఇతరప్రాంతాల్లో ఉన్నా, ఏ ఎన్నికలైనా ఓటింగ్ కు వచ్చేందుకుగాను నిరక్షరాస్యులు ఆసక్తిని చూపుతారు.

కాని, అక్షరాస్యులు మాత్రం ఓటింగ్ కు వెళ్ళేందుకు ఆసక్తిని చూపరు. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది.అయితే పోలింగ్ రోజును ఎక్కువ మంది అక్షరాస్యులు సెలవు దినంగా భావిస్తారు. పోలింగ్ లో పాల్గొనరని పోలైన ఓట్ల లెక్కలు చెబుతున్నాయి.

నిరక్షరాస్యులే అక్షరాస్యుల కంటే నయం

నిరక్షరాస్యులే అక్షరాస్యుల కంటే నయం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే నయమని భావించాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. మొత్తం పోలైన ఓట్లలో సుమారు 10 శాతం ఓట్లు చెల్లుబాటు కాలేదు. విధ్యాధికులు అయి ఉండి కూడ తమ ఓటును సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి అక్షరాస్యులది. ఓటు ఏలా చేయాలో నిరక్షరాస్యులకు ఒక్క సారి చూపితే చాలు వారంతా సక్రమంగా ఓటు చేసే పరిస్థితులు ఉంటాయి.

1996 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలిలా

1996 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలిలా

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 1996లో నల్గొండ పార్లమెంట్ స్థానానికి 486 మంది పోటీచేశారు.ఎస్ఎల్ బిసి ని సత్వరమే పూర్తిచేయాలని కోరుతూ జలసాధన సమితి నేతృత్వంలో తమ నిరసనను ఢిల్లీకి తెలిపేందుకుగాను 486 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అయితే నిర్ణీత షెడ్యూల్ కంటే ఆలస్యంగా ఈ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సిపిఐ తరపున దివంగత బొమ్మగాని ధర్మబిక్షం, కాంగ్రెస్ తరపున తిరునగరు గంగాధర్ పోటీచేశారు. ఆనాడు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పేపర్ నాలుగు పేజీలకు పైగా ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్నారు.అయితే ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఐదువేల లోపే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం 80వేల ఓట్లతో విజయం సాధించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో చెల్లుబాటు కాని ఓట్లు నివ్వెరపరుస్తున్నాయి.మూడు పట్టభద్రుల స్థానాల్లో సుమారు 4.12 లక్షల ఓట్లు పోలయ్యాయి. అయితే ఇందులో 43,496 ఓట్లు చెల్లకుండా పోయాయి.అలాగే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 36,492 ఓట్లు పోలవ్వగా, 1,150 ఓట్లు చెల్లుబాటు కాలేదు.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 4.49 లక్షల ఓట్లు పోలైతే ,44,646 ఓట్లు చెల్లుబాటు కాలేదు.అత్యధికంగా పశ్చిమ రాయలసీమ పట్టభద్దరుల స్థానంలో చెల్లుబాటు కాని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థానంలో సుమారు 18,963 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి.

పది ఓట్లలో ఒక్క ఓటు చెల్లుబాటు కాలేదు

పది ఓట్లలో ఒక్క ఓటు చెల్లుబాటు కాలేదు

ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన పది ఓట్లలో ఒక్క ఓటు చెల్లుబాటు కాకుండా పోయింది. విధ్యాధికులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్యధికంగా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడం పట్ల అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఓట్లు ఎలా వేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ఓట్లన్నీ చెల్లుబాటు కాకుండా పోయాయని అదికారులు అభిప్రాయపడుతున్నారు.ఓటు వేసే వారిలో అవగాహన లేని కారణంగానే ఎక్కువగా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓట్లు ఇలా వేయాలి

ఓట్లు ఇలా వేయాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, నాలుగో ప్రాధాన్యత ఓట్లను వేయాల్సి ఉంటుంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో తాము తొలి ప్రాధాన్యత ఎవరికీ ఇవ్వదలుచుకొన్నారో ఆ అభ్యర్థికి ఎదురుగా ఉన్న గడిలో బాల్ పెన్ తో 1 నెంబర్ వేయాలి.ద్వితీయ ప్రాధాన్యత ఓటును 2 నెంబర్ వేయాల్సి.ఇలా అభ్యర్థులు ఓటు చేయాల్సి ఉంటుంది.

English summary
huge invalid votes in mlc elections.around 10% votes invalid in mlc elections.illiterates better than literates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X