గంగూలీ కోసం ఒక అడుగు వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ!!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవిని రెండోసారి దక్కించుకోవాలని భావించిన మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి అనూహ్యంగా ఒకరి మద్దతు లభించింది. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంగూలీకి మద్దతు పలికారు. ఆయన్ను ఐసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని అభ్యర్థించారు.
గంగూలీ చేసిన తప్పేంటో అర్థం కావడంలేదని, అన్యాయంగా పదవిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని, బెంగాల్ ఒక్కటే కాకుండా భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అని, భారత క్రికెట్ జట్టుకు కూడా కెప్టెన్ గా వ్యవహరించారని, అటువంటి వ్యక్తిని అనుచితంగా బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఐసీసీకి పోటీపడేలా అనుమతివ్వాలని అభ్యర్థించారు.

కోర్టు ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి రెండోసారి పదవులు చేపట్టొచ్చని దీదీ అన్నారు. కారణం తెలియదుకానీ జై షా కొనసాగుతున్నారని, ఆయనపై తనకు ఎటువంటి వ్యతిరేకతకానీ, కోపం కానీ లేదన్నారు. గంగూలీ ఎందుకు బయటకువెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రతీకారం కోసమో, రాజకీయాల కోసమో కాకుండా ఆటను దృష్టిలో పెట్టుకొని నిర్రణయం తీసుకోవాలని దీదీ కోరారు. ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేసేందుకు అక్టోబర్ 20 వరకు సమయం ఉంది. ఆ పదవికి గంగూలీ పోటీ చేయాలంటే బీసీసీఐ ప్రతిపాదించాల్సి ఉంటుంది. బీసీసీఐ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ అధ్యక్షుడిగా కొనసాగమని బోర్డు కోరినప్పటికీ దాన్ని గంగూలీ తిరస్కరించారు.












Click it and Unblock the Notifications