వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓయులో హైదరాబాద్‌పై మందకృష్ణ వార్నింగ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే యుద్ధమేనని, తెలంగాణ సాధించే వరకు విద్యార్థులు యుద్ధభేరీని మోగిస్తూనే ఉంటారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగశనివారం అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రక్రియను అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారిపై అవసరమైతే ఎదురుదాడికి సైతం సిద్ధమేనన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తనది సహాయక పాత్ర మాత్రమేనని, ఉద్యమక్రమంలో తలెత్తే ఒడిదొడుకులను అధిగమించేందుకు కావలసిన ప్రేరణను అందిస్తూ సాగుతున్నట్టు ఈ సందర్భంగా మందకృష్ణ చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలను చేయాలని, ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌ను కూడా మేము సమర్థిస్తున్నామని,విభజనపై టిడిపి, కాంగ్రెస్, వైయస్సార్ పార్టీలు యూ టర్న్ తీసుకొని ప్రజలను వంచిస్తున్నాయన్నారు.

డిసెంబర్ 9 ప్రకటనలో జాప్యం మూలంగానే ఆత్మహత్యలు జరిగాయని, మళ్లీ అలాంటి తప్పిదం జరగకుండా చూసేందుకు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ భ్రమల్లో కూరుకుపోకూడదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా హైదరాబాద్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో భాగంగా, అక్టోబర్ 6న గుంటూరులో అంబేద్కర్ వాదుల మహాసభ , అక్టోబర్ 27న హైదరాబాద్‌లో తెలంగాణ తల్లుల కడుపు కోత మహాసభను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మూడు నెలల పాటు విద్యార్థి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి సర్వేసత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ డిక్షనరీలో ఇఫ్, బట్ మాటలు లేవని, ఇచ్చిన మాటతప్పరన్నారు. తెలంగాణ ఉద్యమం చివరిదశకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోరాటం సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని, పాలనా సౌలభ్యం కోసమే ప్రత్యేక రాష్ట్రమని వివరించారు.

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

ఓయులో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభలో మాట్లాడుతున్న మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. హైదరాబాదును యుటి చేస్తే యుద్ధమేనని హెచ్చరించారు.

యుద్ధభేరీకి

యుద్ధభేరీకి

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభకు తరలి వస్తున్న తెలంగాణ విద్యార్థులు, తెలంగాణవాదులు.

జై తెలంగాణ

జై తెలంగాణ

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభకు తరలి వస్తున్న తెలంగాణ విద్యార్థులు, తెలంగాణవాదులు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ భారీగా యువత తరలి వచ్చారు.

ఆటా పాటా

ఆటా పాటా

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల ఆటా పాటా దృశ్యం.

సాంస్కృతిక ప్రదర్శనలు

సాంస్కృతిక ప్రదర్శనలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల ఆటా పాటా దృశ్యం. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇది జరిగింది.

జై తెలంగాణ

జై తెలంగాణ

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల ఆటా పాటా దృశ్యం.

హాజరైన యువత

హాజరైన యువత

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభకు హాజరై విద్యార్థులు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇది జరిగింది.

వేదికపై

వేదికపై

విద్యార్థి యుద్ధ భేరీ సభలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్, ఇతర ఉద్యమ నాయకులు.

పోస్టర్

పోస్టర్

విద్యార్థి యుద్ధ భేరీ సభలో అక్టోబర్ 6న గుంటూరులో తలపెట్టిన చలో గుంటూరు వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న మందకృష్ణ మాదిగ, ఇతరులు.

వేదికపై నేతలు

వేదికపై నేతలు

విద్యార్థి యుద్ధ భేరీ సభలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, కిషన్ రెడ్డి, వివేక్, సర్వే సత్యనారాయణష ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్, ఇతర ఉద్యమ నాయకులు.

జన సందోహం

జన సందోహం

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి యుద్ధ భేరీ సభకు హాజరైన తెలంగాణ విద్యార్థులు, తెలంగాణవాదులు.

English summary
MRPS president Manda Krishna Madiga on Sunday told in OU JAC's Vidryarthi Yudha Bheri that they will not accept Hyderabad as UT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X