మేయర్ దంపతుల హత్య: చింటూ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: మేయర్‌ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సోమవారం స్థానిక తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కపర్తి ఆదేశాలు జారీ చేశారు. గత నవంబరులో మేయర్‌ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి చింటూతో పాటు 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో ఎనిమిది మంది మినహా మిగిలిన నిందితులందరికి బెయిల్‌ మంజూరైంది.

Also Read: మేయర్ అనురాధ హత్య: రూ.కోట్లు సంపాదించిన చింటూ, ఆస్తులు సీజ్!

Mayor couple murder: Chintu bail petition rejected

ప్రధాన నిందితుడు చింటూతో పాటు మరో ముగ్గురు నిందితులు వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాధ్‌లు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయవాదుల సహకారంతో కోర్టును ఆశ్రయించారు.

వీరి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు స్వీకరించి.. విచారణ నిర్వహించింది. పూర్వాపరాలను పరిశీలించిన పిదప నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మరో నిందితుడు పరంధామ బెయిల్‌ పిటీషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chintu bail petition rejected in Chittoor Mayor couple murder case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి