విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెగాస్టార్ అభిమానులు...జనసేనలోకి:ముహూర్తం ఖరారు!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఎన్నికల్లో రాజకీయ పార్టీకి మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పరిస్థితి అయోమయంగా మారింది...మొన్న ప్రజారాజ్యం...నిన్న కాంగ్రెస్‌...మరి నేడు...అనివార్యంగా జనసేన...ఇదీ మెగాస్టార్ ఫ్యాన్స్ పొలిటికల్ సపోర్ట్ పిక్చర్.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వివిధ రకాలుగా మారుతుండడంతో తదనుగుణంగా అభిమానులు, అభిమాన సంఘాలు, వాటి నేతలు తమ పొలిటికల్ స్టాండ్ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటివరకు చిరంజీవి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బలపరుస్తూ వచ్చిన మెగా అభిమానులు ఆయన హఠాత్తుగా సైలెంట్ అవడంతో అనివార్యంగా జనసేనతో కలసి నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో...

సామాజిక న్యాయం...చిరంజీవి ప్రజారాజ్యం

సామాజిక న్యాయం...చిరంజీవి ప్రజారాజ్యం

2008 ఆగస్ట్ 26 న సామాజిక న్యాయం నినాదంతో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి పార్టీకి మంచి స్పందనే లభించగా ప్రజల నుంచి భారీ స్పందనతో పాటు వివిధ పార్టీల కీలక నాయకులు, ప్రముఖులు, దాదాపు మెగా అభిమాన నేతలు అందరూ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఎన్నికల 2009 ఎన్నికల ఫలితాల్లో ప్రజారాజ్యం పార్టీకి అంతంతమాత్రమే ప్రజాస్పందన లభించింది. ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

ప్రజారాజ్యం నుంచి...కాంగ్రెస్ లోకి

ప్రజారాజ్యం నుంచి...కాంగ్రెస్ లోకి

దీంతో మెగా అభిమానులు తమ ఆరాధ్య నటుడు చిరంజీవి అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యారు. ఆ తరువాత చిరంజీవి కేంద్ర మంత్రిగా మారడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్‌ అంతా ఆయనకు తమ తోడ్పాటు కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోవడంతో చిరంజీవి రాజ్యసభ సభ్యుడి హోదాకే పరిమితమైనప్పటికీ మెగా అభిమానులు ఆయన వెంటే...అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు.

తాజా పరిస్థితులు...జనసేన లోకి

తాజా పరిస్థితులు...జనసేన లోకి

అయితే నవ్యాంధ్రలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మార్పు చెందాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోను కాంగ్రెస్‌ ప్రాబల్యం కోల్పోవడం, మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా మౌనం దాల్చడం, త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెగా అభిమానులు తమ పొలిటికల్ స్టాండ్ పై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చిరంజీవి సోదరుడైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీవైపే వాళ్లు అడుగులు వేయడం అనివార్యంగా మారింది.

జనసేన లోకి...ముహూర్తం ఖరారు

జనసేన లోకి...ముహూర్తం ఖరారు

ఈ క్రమంలో చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు రవణం స్వామినాయుడుతోపాటు ఇరురాష్ట్రాల్లో ఉన్న చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, నాగబాబు, రామ్‌చరణ్‌తేజ్‌తోపాటు వారి కుటుంబీకుల ఫ్యాన్స్‌కు చెందిన నాయకులు, అభిమానులు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు వారంతా ఈనెల 9న జనసేన చేరాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న మెగా అభిమానులందరూ జులై 9 వతేదీకి హైదరాబాద్‌ తరలిరావాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ పిలుపుపై ఎక్కువమంది సానుకూలంగానే స్పందించినా కొంతమంది మెగా అభిమానులకు మాత్రం ఈ విధమైన పిలుపు నచ్చలేదని అంటున్నారు.

 కారణం...చిరంజీవి వేరు...జనసేన వేరు

కారణం...చిరంజీవి వేరు...జనసేన వేరు

కారణం చిరంజీవి కాంగ్రెస్ లో ఉండగానే పవన్ కల్యాణ్ ఆయనతో సంబంధం లేకుండా ఇంకా చెప్పాటంటే కాంగ్రెస్ కు బద్దశత్రువైన టిడిపి-బిజెపి కూటమితో అంటకాగారని, అలాంటి జనసేనకు ఎలాంటి సంప్రదింపులు,సన్నాహకాలు లేకుండా ఏకంగా చేరికలకే పిలుపునివ్వడం సరికాదని వారి భావనగా తెలుస్తోంది. అయితే తమ సంఘ నాయకులు చిరంజీవి అనుమతి తీసుకునే ఈ ప్రకటన చేసి ఉంటారని, మెగా అభిమానులుగా ఆయన ఆకాంక్షను బలపరచడమే తమ
బాధ్యతగా వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మెగా అభిమానులు భారీ సంఖ్యలో ఈ నెల 9 న జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

English summary
Vijayawada:The situation of the Megastar Chiranjeevi fans has become confused over the support of a political party in the upcoming elections...So far, Chiranjeevi fan's association leaders decided that to support Janasena party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X