287 మంది అర్హులకు కారుణ్య నియామకాలు: మంత్రి గొట్టిపాటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కు చెందిన సీఓఈఈటీ భవనంలో మంత్రి గొట్టిపాటి ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ పరిధిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 34 మంది అర్హులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కూటమి ఏర్పడిన 18 నెలల కాలంలో ఇప్పటి వరకు 287 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పనిచేస్తోందన్నారు. ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. ఉద్యోగుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. సమర్థత, పారదర్శకత, వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సౌర శక్తిని ప్రోత్సహిస్తూ గతంలో విద్యుత్ లేని గ్రామాలు, గిరిజన ఆవాసాలకు వెలుగులు నింపుతున్నామని మంత్రి తెలిపారు. వినియోగదారులపై అదనపు భారం మోపకుండా విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. వినియోగదారుల విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని, ఇప్పటికే 13 పైసల టారిఫ్ ట్రూ-డౌన్ సాధించామని చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో రైతే రాజని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా జరిగేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలో అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ (Revamped Distribution Sector Scheme) పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.

ఫేజ్-1 పనులను వేగవంతంగా పూర్తిచేసి ఫేజ్-2కు వెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పనుల నాణ్యత, గడువులపై కఠిన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలో నిర్మిస్తున్న కొత్త సబ్స్టేషన్ల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మార్చి 2026 నాటికి సుమారు 60కు పైగా సబ్స్టేషన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడి అంతరాయాలు తగ్గుతాయని వారు పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం చేపట్టి రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్ల సంఖ్య పెంచాలని, దానికి తగిన కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రజల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మానవ తప్పిదాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి..
విద్యుత్ శాఖలో మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు ఈపీడీసీఎల్ అధికారులు అభివృద్ధి చేసిన కొత్త యాప్ గురించి సీఎండీ పృథ్వీ తేజ్.. మంత్రికి వివరించారు. ఈ యాప్ ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు ఉద్యోగుల భద్రతను మెరుగుపరచవచ్చని మంత్రికి తెలిపారు.
వినియోగదారులు కేంద్రంగా పనిచేస్తూ సేవల నాణ్యతను పెంచాలని, పారదర్శకత, బాధ్యతతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ లు పల్లా శ్రీనివాసరావు, పి. విష్ణుకుమార్ రాజు, సంస్థ డైరెక్టర్లు టి. వి. సూర్యప్రకాష్, ఎస్. హరిబాబు, సీజీఎం లు, ఎస్ఈ లు, తదితరులు పాల్గొన్నారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications