ఒకే ఒక్కడు సీన్ రిపీట్: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్ సడన్ ఎంట్రీ
ముప్పై ఏళ్ళ క్రితం.. ఒకే ఒక్క పిలుపుతో వ్యవస్థను ఉరికించిన ఆ 'విజన్' మీకు గుర్తా? తప్పు చేసిన అధికారి కళ్లలోకి చూసి 'యు ఆర్ సస్పెండెడ్' అన్న ఆ కంఠస్వరం గుర్తా? అచ్చం అలాంటి పదునైన పాలనే నేడు '2.0' వెర్షన్‌లో ప్రత్యక్షమైంది. తండ్రి చంద్రబాబు నాయుడు 'ఆకస్మిక తనిఖీల' శైలిని పుణికిపుచ్చుకున్న తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. తనదైన శైలిలో 'యాక్షన్' మొదలుపెట్టారు. ఇది సినిమా కాదు.. అంతకు మించిన రియల్ రైడ్.
మంగళగిరి మయూరి టెక్ పార్క్.. ఏపీఈడీబీ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం మంగళవారం అట్టహాసంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ ఒక దిశగా వెళ్లాలి. కానీ, అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది! లోకేష్ కారు స్టీరింగ్ ఒక్కసారిగా మైలవరం వైపు మళ్లింది. కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బందికి చెమటలు పట్టాయి.. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు 'ఏం జరుగుతోంది?' అని ఆందోళనలో మునిగిపోయారు.

కానీ ఎవరు నోరెత్తి ఎటు వెళ్తున్నాం అని అడగలేదు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బంది సైతం.. లోకేష్ చెప్తున్న రూట్ మ్యాప్ డైరెక్షన్స్ ను సైలెంట్ గా ఫాలో అవుతున్నారు. అందరిలోనూ హైటెన్షన్. ఎటు వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం. అక్కడ భద్రతా తనిఖీలు జరగాయా లేదా?.. జర్నీ సాగుతున్నంత సేపు అందరిలో ఉత్కంఠే.
టైమ్ మధ్యాహ్నం 12:00 గంట.. లొకేషన్: తారకరామా నగర్ స్కూల్!
కొంతసేపటి తర్వాత కాన్వాయ్ ఓ స్కూల్ ముందు ఆగింది. అప్పుడు అర్ధమైంది అందరికి. వారం క్రితం ఇదే స్కూల్ విద్యార్థుల ఆకలి కేకల వైరల్ గా మారగా.. అక్కడి పరిస్థితిపై లోకేష్ సంధించిన 'అస్త్రం'! అని. నారా లోకేష్ లోపలికి వెళ్లే సమయానికి స్కూల్లో పిల్లలు భోజనం చేస్తున్నారు. వారం క్రితం ఇక్కడ భోజనం బాగాలేదని వీడియోలు వచ్చాయి.. హెచ్చరికలు వెళ్లాయి. కానీ, మంత్రి స్వయంగా వస్తారని ఎవరూ ఊహించలేదు!
అకస్మాత్తుగా స్కూల్ గేట్ ముందు మంత్రి కాన్వాయ్ ఆగింది. లోకేష్ కారు దిగడమే ఆలస్యం.. అక్కడ ఉన్న అధికారుల ఫ్యూజులు అవుట్! మండల స్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు ఫోన్లు మోగుతూనే ఉన్నాయి.. 'సార్ వచ్చేసారు.. మాకు చెప్పలేదు.. మాకు తెలియదు' అంటూ అధికారుల మధ్య ఒకటే పరస్పర నిందారోపణలు. రాష్ట్ర విద్యాశాఖలో ఒక్కసారిగా 'హై అలర్ట్' ప్రకటించినంత పనైంది.
ముద్ద రుచి చూసి.. భరోసా ఇచ్చి!
మంత్రి లోకేష్ నేరుగా పిల్లల వద్దకు వెళ్లారు. అక్కడ ప్రోటోకాల్ లేదు.. ఆడంబరాలు లేవు. ఒక అన్నలా, ఒక తండ్రిలా పిల్లల మధ్య కూర్చున్నారు. "భోజనం చేస్తున్నారా? ఫుడ్ బాగుందా?" అని అడుగుతూనే.. ఆ భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. ఆ ముద్ద తిన్న లోకేష్ కళ్లలో పదును పెరిగింది. అధికారుల వైపు తిరిగి ఒక్కటే మాట చెప్పారు.. "నా ఇంట్లో పిల్లలకు ఏ భోజనం పెడతానో.. నా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి అదే నాణ్యమైన భోజనం అందాలి. క్వాలిటీలో తేడా వస్తే కఠిన చర్యలు తప్పవు!" ఆ హెచ్చరికతో మైలవరం నుంచి అమరావతి వరకు వ్యవస్థ గడగడలాడింది.
ఒకే ఒక్కడు రిపీట్స్: 95 నాటి చంద్రబాబు పాలన గుర్తుకు తెచ్చిన లోకేష్..!
— oneindiatelugu (@oneindiatelugu) March 17, 2026
నాణ్యత తగ్గితే సహించేది లేదు: మైలవరం పాఠశాలలో మంత్రి లోకేష్ వార్నింగ్#NaraLokesh #SchoolInspection #Mylavaram #PoliticsToday #AndhraPradesh #OITelugu pic.twitter.com/vcDqX8FD57
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications