చంద్రబాబుకు కేంద్రం మరో షాక్: తన పేరే పెట్టుకుంటున్నారని...

Posted By:
Subscribe to Oneindia Telugu
Modi's Government Has Stopped Central Funds To AP Cchemes

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు చెందిన కొన్ని పనులకు జారీ చేసిన టెండర్లను నిలిపేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన కేంద్రం తాజాగా మరో ఝలక్ ఇచ్చినట్లు తేలింది.

రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా మార్గదర్శక సూత్రాలతో పనులను చేపడితేనే తదుపరి నిధులు వస్తాయనే షరతులతో కూడిన విధివిధానాలు అమలులోకి వచ్చాయి. దాంతో కేంద్ర పథకాలకు రావాల్సిన నిధులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

సర్వే బృందాల నివేదికలతోనే..

సర్వే బృందాల నివేదికలతోనే..

కేంద్ర నిధులతో చేపట్టే పనుల్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన ఉండడం లేదని, వాటిని రాష్టమ్రే నిర్వహిస్తుందనే పద్దతిలో ప్రచారం సాగుతోందని ఢిల్లీ నుంచి వచ్చిన సర్వే బృందాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికతో పాు బీజేపీ నేతల ఫిర్యాదులు చేయడం వంటి కారణాల వల్ల కేంద్ర పథకాలకు అందాల్సిన నిధులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ఉపాధి హామీ పథకాలకు బ్రేక్

ఉపాధి హామీ పథకాలకు బ్రేక్

ఉపాధి హామీ పథకంతోపాటు వివిధ పథకాలకు సంబంధించి గ్రామాల్లో జరిగే పనులకు గత పక్షం రోజులుగా నిధుల రాక నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రం చేపట్టిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలోని ఉపాధి హామీ పథకం వాటా నిధులు నిలిచిపోయినట్లు సమాచారం.

కొన్ని పనులకు చంద్రబాబు పేరు....

కొన్ని పనులకు చంద్రబాబు పేరు....

కేంద్ర నిధులతో అమలు జరిగే కొన్ని పనులకు చంద్రబాబు పేరు పెట్టుకున్నట్టు కేంద్ర బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. చంద్రన్న బీమా పథకాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. వీటికి కేంద్రం సాయం ఏమీ లేదనే ప్రచారాన్నే ప్రజలు నమ్ముతున్నట్లు సర్వేలు తేల్చినట్లు సమాచారం. దీంతో కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు తదితర మౌలిక లిక సదుపాయాల కల్పన పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

 ఇలా చేయాల్సింది గానీ...

ఇలా చేయాల్సింది గానీ...

ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల్లో వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలకు వినియోగించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి ఈ నిధులు నేరుగా స్థానిక పంచాయతీ ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. అయితే ఎమ్మెల్యేల అనుమతితో స్థానిక ప్రజా ప్రతినిధులు వీటిని ఖర్చు చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర బృందాలు కనిపెట్టినట్లు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Giving another shock to Andhra Pradesh CM Nara Chandrababu Naidu's government, Narendra Modi's union government has stopped central funds to AP schemes.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి