విజయవాడపై ప్రేమ గుంటూరుపై ఏది: సీఆర్డీఏపై మోదుగుల సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అమరావతి సీఆర్డీఏ (కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఆర్డీఏ అధికారులకు విజయవాడ మీద ఉన్న ప్రేమ గుంటూరు పైన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరుపై అధికారులు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు గుంటూరుకు ఏం చేశారో వివరించాల్సిన బాధ్యత సీఆర్డీఏ అధికారులపై ఉందన్నారు.

Modugula Venugopal Reddy hot comments on CRDA officers

మోదుగుల ఇటీవల పలుమార్లు షాకింగ్ కామెంట్లు చేశారు. రైతుకు రుణమాఫీ పూర్తిగా కాలేదని గత నెలలో వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో రియాల్టర్లు లక్షల హెక్టార్ల ఎకరాల్లో లేఅవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారన్నారు.

చంద్రన్న బీమాతో అందరికీ న్యాయం జరుగుతోందా అని అంతకుముందు ప్రశ్నించారు. కార్మికులు కాని వారే ఎక్కువగా బీమా పథకాన్ని వాడుకుంటున్నారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Modugula Venugopal Reddy hot comments on CRDA officers
Please Wait while comments are loading...