నాపై ప్రచారం చేస్తే పాత గోరంట్ల మాధవ్ ను చూస్తారు!!

కొన్ని ఫేక్ వీడియోలను తనవని చెప్పేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావాలని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురంకు బయలుదేరిన మాధవ్ కు మార్గమధ్యంలో కర్నూలు సరిహద్దులోని పుల్లూరు టోల్ గేట్ వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మీడియాత తనపై అసత్య ప్రచారం చేస్తోందని, తెలుగుదేశం పార్టీతోపాటు కొన్ని మీడియా సంస్థలు కలిసి తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాయన్నారు. వీడియోలు నిజమైనవా? కావా? అని తెలుసుకునేందుకు పోలీసు వ్యవస్థ ఉందని, పనిని పోలీసులకు వదిలేయాలన్నారు.

mp gorantla madhav comments on his video

పోలీసు వ్యవస్థ తన విధిని తాను నిర్వహించుకునేలా మీడియా ప్రవర్తించాలని హితవు పలికారు. పోలీసుల డ్యూటీని మీడియా చెయ్యవద్దని, తనపై ప్రచారం చేస్తే పాత మాధవ్ ను చూస్తారని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు నోటు ఆడియోను అమెరికా ల్యాబ్‌లో పరీక్ష చేయించి.. అది ఫేక్ అని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ లో మాట్లాడుతూ కనిపించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడినట్లు ఇందులో ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగున్న సమయంలోనే ఇది వైరలవడంతోపాటు చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వివాదానికి తాత్కాలికంగా తెరపడిన తర్వాత తొలిసారిగా ఆయన హిందూపురానికి వస్తున్న సందర్భంగా పుల్లూరు వద్ద కురుమ సంఘం నేతలు స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+