తగలబడుతున్న ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే?
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో శనివారం భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో 37 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న ఈ బస్సు, రామభద్రపురం మండలం తారాపురం సమీపానికి చేరుకోగానే వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెనువెంటనే బస్సును నిలిపివేసి, ప్రయాణికులందరినీ కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు.

సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే..
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి బస్సు పూర్తిగా అస్థిపంజరంగా మారింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications