అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రస్తుత రాజకీయాలపై పిహెచ్ డీ చేస్తా, చెల్లిని, అమ్మను చంపుతామన్నారు: సత్యంబాబు

ఆయేషా హత్య కేసులో నిర్ధోషిగా విడుదలైన సత్యం బాబు జైల్లో ఉన్నంత కాలం ఖాళీగా గడపలేదు. కాలాన్ని వృధాచేయకుండా డిగ్రీ పూర్తి చేశాడు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా ఆయన బిఎలో పొలిటికల్ సైన్స్ పూర్తి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆయేషా హత్య కేసులో నిర్ధోషిగా విడుదలైన సత్యం బాబు జైల్లో ఉన్నంత కాలం ఖాళీగా గడపలేదు. కాలాన్ని వృధాచేయకుండా డిగ్రీ పూర్తి చేశాడు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా ఆయన బిఎలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాడు.ప్రస్తుత రాజకీయాలపై పిహెచ్ డి చేయనున్నట్టు చెప్పారాయన ఈ మేరకు సోమవారం నాడు ఆయన తన డిగ్రీ సర్టిఫికెట్ సోమవారం నాడు హైద్రాబాద్ లో తీసుకొన్నారు.

విజయవాడ సమీపంలోని హాస్టల్ లో ఫార్మసీ విద్యార్థిని హాత్యకేసులో సుమారు 8 ఏళ్ళ పాటు సత్యం బాబు జైల్లో నిందితుడిగా గడిపాడు.అయితే సత్యంబాబును ఇటీవలే హైకోర్టు విడుదల చేసింది.

అయితే 8 ఏళ్ళ పాటు జైల్లో గడిపిన సత్యంబాబు ఖాళీగా కూర్చోలేదు. అంబెద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా బిఎ పూర్తి చేశాడు. రానున్న రోజుల్లో ఎంఏ కూడ పూర్తి చేస్తానని సత్యం బాబు చెబుతున్నాడు.

జైలుకు వెళ్ళే సమయంలో తాను నిరక్షరాస్యుడిగా వెళ్ళానని, జైలు నుండి బయటకు వచ్చే సమయంలో తాను అక్షరాస్యుడిగా మారానని సత్యంబాబు చెప్పారు.సోమవారం నాడు ఆయన సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు అందుకే ఒప్పుకొన్నా

అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు అందుకే ఒప్పుకొన్నా

మా అమ్మను, చెల్లిని చంపేస్తామని, ఎన్ కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే తాను ఆయేషాను హాత్య చేసినట్టు ఒప్పుకొన్నానని సత్యంబాబు చెప్పారు. ఈ కేసులో సత్యంబాబును ఇటీవలే హైకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది.తనను అరెస్టు చేసిన తర్వాత వారం రోజుల పాటు తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఆ దెబ్బలకు తన కాళ్ళు చచ్చుబడిపోయాయని చెప్పారు. జైలులో ఉండి చికిత్స తీసుకొన్న తర్వాత కోలుకొన్నానని చెప్పారు సత్యంబాబు.

నిరక్ష్య రాస్యుడిగా వెళ్ళి డిగ్రీతో బయటకు వచ్చాను

నిరక్ష్య రాస్యుడిగా వెళ్ళి డిగ్రీతో బయటకు వచ్చాను

జైలుకు వెళ్ళే సమయంలో తాను నిరక్ష్యరాస్యుడిగానే ఉన్నానని చెప్పారు. అయతే జైలులో చదువుకొని పరీక్షలు రాసి డిగ్రీ పాసయ్యాయని సత్యంబాబు చెప్పారు. అయితే ఈ కేసులో తాను నిర్ధోషినేనని ఆయేషా తల్లిదండ్రులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీసులు అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తే ఆయేషా తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని చెప్పారు.

వారందరికీ రుణపడి ఉంటాను

వారందరికీ రుణపడి ఉంటాను

ఆయేషా తల్లిదండ్రులతో పాటు, కొందరు అడ్వకేట్లు ముందుకు వచ్చి ఈ కేసును వాదించారని చెప్పారు. వారందరికీ తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఆయేషా కేసులో నిందితులను పట్టుకొని శిక్షపడేటట్టు చేసి ఆమె తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నారు సత్యంబాబు.8 ఏళ్ళపాటు తాను జైలులో ఉండడంతో తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురైందన్నారు. ప్రభుత్వం తన కుటుంబాన్ని పోషించుకొనేందుకు ఉద్యోగం, వ్యవసాయం చేసుకొనేందుకు స్థలం , ఇల్లు ఇవ్వాలని ఆయన కోరారు.

రాజకీయ ఒత్తిడితోనే సత్యంబాబును ఇరికించారు

రాజకీయ ఒత్తిడితోనే సత్యంబాబును ఇరికించారు

రాజకీయ ఒత్తిడి వల్లే సత్యంబాబును ఆయేషా కేసులో ఇరికించారని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ చెప్పారు. సత్యంబాబు తప్పించుకోకుండా ఉండేందుకుగాను ఆయేషా కేసుతో పాటు మరో 18 సంబంధం లేని కేసుల్లో ఇరికించారని చెప్పారు. హైకోర్టు తీర్పులో తప్పుడు కేసులో ఇరికించినందుకుగాను బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.ఈ విషయమై గవర్నర్ ను, జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్ ను కలవనున్నట్టు చెప్పారాయన.

డిగ్రీ పట్టా తీసుకొన్న సత్యంబాబు

డిగ్రీ పట్టా తీసుకొన్న సత్యంబాబు

జైలులో ఉన్న కాలంలో డిగ్రీ పరీక్షలు రాసిన సత్యం బాబు సోమవారం నాడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టా తీసుకొన్నారు. భవిష్యత్తులో తాను ఎంఏ పూర్తి చేస్తానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలపై పీహెచ్ డి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భవిష్యత్ ను పునర్నిర్మించుకొనే పనిలో ఉన్నానని సత్యంబాబు చెప్పారు.

English summary
Pidatala Satyam Babu, who suffered nine years in jail before being acquitted and released in the Ayesha Meera murder case, has achieved something during the time he was in jail. Through distance education, he earned a BA degree in political science.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X