జగన్‌తో ఎలాంటి సంబంధం లేదు, బినామీనీ కాదు: తేల్చేసిన సునీల్

Subscribe to Oneindia Telugu

అమరావతి: తనకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ప్రైవేట్ బస్ ఓనర్స్, ఆపరేటర్స్ అసోసియేషన్ నేత సునీల్ స్పష్టం చేశారు. తాను జగన్‌కు బినామీ కూడా కాదని తేల్చి చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టుకు వెళ్తామని సునీల్ అన్నారు. ట్రావెల్స్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని ఆయన తెలిపారు.

No relationship with ys jagan, says Sunil

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ట్రావెల్స్‌పై చట్ట వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని సునీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు లోబడే తాము బస్సులు నడుపుతున్నామని తెలిపారు.

ఓ వ్యక్తి ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గాయని ఆరోపించిన ఆయన.. ఆ వ్యక్తి పేరు చెప్పకపోవడం గమనార్హం. కాగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలకు తాము సిద్ధమని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Private buses association leader Sunil on Monday said that no relationship with YSR Congress Party president YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...