వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాడేరు ఎమ్మెల్యేకి నాన్‌ బెయిలబుల్ వారెంట్, ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఒక సినిమా హాల్ లీజు విషయంలో ఆమెపై పాడేరు కోర్టులో కేసు దాఖలైంది. అయితే ఈ కేసులో కోర్టు విచారణకు ఈశ్వరి హాజరుకాలేదు.

దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన పాడేరు ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఎమ్మెల్యే సహా ఏడుగురికి నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

Non bailable warrant issued on paderu mla

ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు

అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో కొత్తపల్లి గీతపై పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసినట్లు గీతపై ఆరోపణలు వచ్చాయి. సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై విచారణ జరిపేందుకు సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. బ్యాంకును మోసం చేసిన కేసులో ఈనల 19న హాజరు కావాలని ఆదేశించింది.

గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఎంపీ కొత్త పల్లి గీత వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ42.79 కోట్లు నష్టం వాటిల్లందని చార్జిషీట్ పేర్కొంది. ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి.

తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్దేశ పూర్వకంగా బ్యాంకుని మోసం, వంచన చేయడం లాంటి ఆరోపణలతో వీరిపై ఐపీసీలోని 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

ఎమ్మెల్యేలకు ‘అమరావతి'లో ఇళ్ల స్థలాలు...!

ఏపీ నూతన రాజధాని 'అమరావతి'లో ఎమ్మెల్యేలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా చూడాలని మంగళవారం సమావేశమైన జనరల్‌ పర్పసెస్‌ కమిటీ నిర్ణయించిందని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు వెల్లడించారు.
ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావును, సీఎం చంద్రబాబును కోరనున్నట్లు ఆయన తెలిపారు.

ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఇస్తున్న హెచ్‌ఆర్‌ఏ చాలా తక్కువగా ఉందని, దానిని కూడా పెంచాలనే ప్రతిపాదనను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు.

English summary
Non bailable warrant issued on paderu mla giddi eswari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X