అమెరికా మెప్పుకోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తారా?: బాబుపై కారత్ ఫైర్

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా మెప్పు కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడటం లేదని మండిపడ్డారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రమాదకరమని ప్రకాశ్ కారత్ ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన అమెరికా పర్యటనలో అణు రియాక్టర్ల సరఫరాకు ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. దీనిని తొలుత గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించి, తర్వాత రాష్ట్రానికి తరలించారన్నారు.

ఇతర దేశాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భౌతిక శాస్తవ్రేత వివేక్ మోంటైరో, సిపిఐ నేత జెవి సత్యనారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింగరావు తదితరులు ప్రసంగించారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

అమెరికా మెప్పు కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడటం లేదని మండిపడ్డారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రమాదకరమని ప్రకాశ్ కారత్ ఆరోపించారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన అమెరికా పర్యటనలో అణు రియాక్టర్ల సరఫరాకు ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. దీనిని తొలుత గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించి, తర్వాత రాష్ట్రానికి తరలించారన్నారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

ఇతర దేశాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. యుపీఏ ప్రభుత్వంలో న్యూక్లియర్ సహకార ఒప్పంద సమయంలో భారత్‌ను అమెరికా తన సైనిక మిత్రునిగా వ్యవహరించేందుకు అంగీకరిస్తేనే ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తామని షరతు పెట్టడాన్ని గుర్తు చేశారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

50 వేల మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తికి వీలుగా రియాక్టర్లను కొనుగోలు చేస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారని తెలిపారు. అందులో ఆరు రియాక్టర్లను కొవ్వాడలో ఏర్పాటు చేస్తున్నారన్నారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

ఈ వాణిజ్య ఒప్పందంలో అమెరికాకు దోచి పెట్టడం మినహా దేశ ప్రయోజనాలు లేవని ఆరోపించారు. అదే విధానాన్ని ప్రధాని మోడీ కొనసాగిస్తున్నారన్నారు. జర్మనీ, జపాన్, అమెరికా తదితర దేశాలు అణువిద్యుత్‌కు దూరంగా వెళ్లిపోతున్నాయని తెలిపారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

ఒక మెగావాట్ అణు విద్యుత్ ఉత్పత్తికి 45 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు. పుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ప్రమాదం తర్వాత వాటివల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు తెలిసిందని తెలిపారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

కేంద్ర ఇంధన శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇఎఎస్ శర్మ మాట్లాడుతూ.. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు వల్ల అమెరికాలో 30ఏళ్ళపాటు ఉద్యోగాలు వస్తాయని, భారత్‌లో మాత్రం చిన్నా చితక ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

కేంద్రానికి రాష్ట్ర ప్రజలు అంటే చులకనా? గుజరాత్ ప్రజలు విలువైన వారా? అని ప్రశ్నించారు. దీనిపై అధికారులను ప్రశ్నించాలని ఎనిమిది ప్రశ్నలు వివరించారు.

ప్రకాశ్ కారత్

ప్రకాశ్ కారత్

ప్రమాదం జరిగితే ఒడిశాలోని కొంత భాగం నుంచి కాకినాడ వరకూ నాశనం అవుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ప్రపంచంలో 101 అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగాయని, అందులో 27 భారీవని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CPM leader prakash karat on Sunday fired at PM Narendra Modi and Andhra Pradesh CM Chandrababu Naidu for kovvada nuclear plant issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి