వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా... ఇద్దరికీ ఎదురు తిరిగింది!: రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

రేపు ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య తాను మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ/హైదరాబాద్: రేపు (శుక్రవారం) ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య తాను మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సీఎంను అవుతా, పేర్లన్నీ గుర్తు పెట్టుకొని మీ తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్సీఎంను అవుతా, పేర్లన్నీ గుర్తు పెట్టుకొని మీ తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్

ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ ఈ రోజు (గురువారం) విశాఖ ఆర్కే బీచ్ వద్ద యువత, విపక్షాలు నిరసన చేపట్టాలని భావించాయి. కానీ పోలీసులు దానిని భగ్నం చేశారు.

ఈ రోజు గణతంత్ర వేడుకలు, రేపు పారిశ్రామిక పెట్టుబడుల సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు నిరసనకారులను ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వైసిపి అధినేత జగన్‌ను విమానాశ్రయంలోనే నిర్బంధించారు.

Pawan Kalyan to meet the press tomorrow

ఆర్కే బీచ్ వద్ద యువత నిరసన తెలుపుతారని, వారికి అవకాశమివ్వాలని పవన్ వరుసగా ట్వీట్లు చేశారు. ప్రభుత్వం, పోలీసులు నో చెప్పడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా ట్వీట్లు చేస్తూ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.

అయితే ప్రభుత్వం, పోలీసుల వ్యూహం ముందు ఇటు జగన్, అటు పవన్ కళ్యాణ్ నిరసన కార్యక్రమం జరగలేదు.

ఎదురు తిరిగిందా?

మరో విషయమేమంటే ప్రత్యేక హోదా పైన జగన్, పవన్‌లు ఇచ్చిన నిరసన సెగ ఎదురు తిరిగిందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే హోదా ఇవ్వమని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి.. హోదా బదులు మంచి ప్యాకేజీ వస్తోందని, అందుకే అంగీకరించామని చెబుతోంది.

పోలీసుల ఎఫెక్ట్: రూటుమార్చిన పవన్ కళ్యాణ్ 'ఫ్యాన్', వేదిక మారింది!పోలీసుల ఎఫెక్ట్: రూటుమార్చిన పవన్ కళ్యాణ్ 'ఫ్యాన్', వేదిక మారింది!

మొత్తానికి ఆంధ్రా ప్రజలు ప్రత్యేక హోదా పైన ఆశలు వదిలేసుకోవడమే లేక ఈ ప్రభుత్వాల హయాంలో రాదని దానిని ప్రస్తుతానికి పక్కన పెట్టడమో చేశారు. ఈ నేపథ్యంలో పవన్, జగన్‌లు ఊహించినట్లుగా నిరసనకు అంత స్పందన రాలేదని కూడా అంటున్నారు.

గణతంత్ర వేడుకలు ఉండటం, అలాగే, రేపు పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల కోణంలోనే వారి ఆలోచన కనిపిస్తోందని చాలామంది భావించినందునే.. వారు అనుకున్న స్పందన రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ రేపు ప్రెస్ మీట్ పెడతానని చెప్పడం గమనార్హం.

English summary
Jana Sena chief Pawan Kalyan said that he will address in press meet on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X