వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉర్జీత్ పటేల్! మీ అద్భుత నిర్ణయం: నోట్ల రద్దుపై దుమ్ము దులిపిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు నోట్ల రద్దు పైన స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు నోట్ల రద్దు పైన స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) ఉర్జీత్ పటేల్ పైన పవన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం అన్నారు.

నోట్ల రద్దు వల్ల నల్ల కుబేరులకు ఎలాంటి నష్టం జరగలేదని, పైగా మీ దయ వల్ల బ్యాంకు ఉద్యోగులు నల్ల కుబేరుల జాబితాలో చేరిపోయారన్నారు. నల్ల కుబేరులు మాత్రం ఇంట్లోనే కూర్చొని కోట్లు తెచ్చుకున్నారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 69 ఏళ్లయిన తర్వాత కూడా మలమూత్రాలు చేతులతో ఎత్తే మన దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యమైనా అని ప్రశ్నించారు.

నోట్ల రద్దు వల్ల పేద, బడుగు, రోజువారి కూలీలు, గృహిణులు, వ్యాపారులపై చాలా ప్రభావం పడిందన్నారు. నోట్ల రద్దుపై నేడు చర్చించిన అంశాలు తనకు సంతృప్తినివ్వలేదని, ఈ సమస్యపై తన ఆలోచనలు విస్తృతంగా పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

బాలరాజు సహా పలువురి మృతికి..

బాలరాజు సహా పలువురి మృతికి..

కర్నూలులో బాలరాజు సహా దేశంలోని పలువురి మరణానికి నోట్ల రద్దు కారణమని దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించి బాలరాజు ఫోటోను, ఉర్జీత్ పటేల్ ఫోటోను తన ట్విట్టర్ అకౌంటులో పవన్ కళ్యాణ్ పొందుపర్చారు. ప్రధానంగా పవన్ ఉర్జీత్ పటేల్‌ను టార్గెట్ చేసుకున్నారు.

వీరికే ఇబ్బందులు

వీరికే ఇబ్బందులు

మీ అద్భుత నిర్ణయం 'నోట్ల రద్దు' అంటూ పవన్ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో ఆదివాసీలు, రైతులు, రోజువారీ కూలీలు, ఇంట్లోని ఆడవారు, ఉద్యోగులు, వృద్ధులు, కూరగాయలు, పండ్లు అమ్మేవారు, నిర్మాణ కూలీలు, కాంట్రాక్టు లేబర్లు, చిన్న చిన్న వ్యాపారులు తదితరులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఇళ్లలో కూర్చొని కొందరు కోట్లు దోచుకుంటున్నారు

ఇళ్లలో కూర్చొని కొందరు కోట్లు దోచుకుంటున్నారు

క్యాష్ లెస్ ఎకానమీ అంటూ ప్రజలను భ్రమలలో ముంచుతున్నారన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు చాలామంది వరుసల్లో నిలబడి చనిపోతుంటే, కొందరు ఇళ్లలో కూర్చొని కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. కిలోమీటర్ల క్యూ లైన్లలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఉర్జీత్! సంతోషంతో గంతులేస్తున్నారమో.. కానీ వాస్తవం ఇదీ..

ఉర్జీత్! సంతోషంతో గంతులేస్తున్నారమో.. కానీ వాస్తవం ఇదీ..

ఉర్జీత్ పటేల్! 86 శాతం నోట్లు మీ అకౌంటులో డిపాజిట్ కావడంతో మీరు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారేమోనని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, నల్లధనం మొత్తం రూపుమాపామని కూడా గర్వంగా చెప్పుకుంటున్నారని, కానీ అసలు వాస్తవం వేరు అన్నారు. మీరు పాత నోట్లతో కొత్త నోట్లను మార్చారని ఎద్దేవా చేశారు.

English summary
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు నోట్ల రద్దు పైన స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) ఉర్జీత్ పటేల్ పైన పవన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X