పోలవరంపై బిజెపి వ్యూహం: చంద్రబాబుకు తలనొప్పులు, జగన్‌కు జోష్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై బిజెపి వ్యూహంలో భాగంగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గడువులోగా పూర్తి కాకుండా చూసే ఉద్దేశం బిజెపికి ఉందనే ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం పుంజుకోవాలని బిజెపి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.

బిజెపి విస్తరణకు మిత్రపక్షమైనప్పటికీ తెలుగుదేశం పార్టీయే అడ్డంకిగా ఉంది. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఎన్నికలలోగా పూర్తయితే చంద్రబాబు మరింతగా బలపడే అవకాశం ఉంది. దానివల్ల రాజకీయంగా బిజెపికి నష్టం కలిగే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టులకు కోర్రీలు పెడుతున్నట్లు భావిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే..

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే..

2019నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే చంద్రబాబు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అప్పటికి ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నా కేంద్రం మాత్రం సహకరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వారిద్దరిని తప్పించడం వల్ల...

వారిద్దరిని తప్పించడం వల్ల...

చంద్రబాబుకి సహకరించే ఉమా భారతిని జలవనరుల శాఖ నుంచి తప్పించడం ద్వారా, వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతిగా పంపించడం ద్వారా ఢిల్లీలో చంద్రబాబుకు సహకారం లభించకుండా చూశారనే ప్రచారం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఉమాభారతి కొంత ప్రయత్నం చేశారు. దాంతో ఢిల్లీలో చంద్రబాబుకు సహకారం కరువైందనే మాట వినిపిస్తోంది.

కేంద్రంపై అంతా నెట్టేసేందుకు...

కేంద్రంపై అంతా నెట్టేసేందుకు...

అయితే, చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులే కారణమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ఆయన కసరత్తు చేసినట్లు కనిపిస్తున్నారు. బిజెపి నేతలు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ అడ్డుపడుతున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శలు ఇందులో భాగమని అంటున్నారు.

తెరపైకి విభజన హామీలూ...

తెరపైకి విభజన హామీలూ...

వ్యూహాత్మకంగానే చంద్రబాబు విభజన హామీలను ప్రస్తావించినట్లు భావిస్తున్నారు. వాటిని ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. తాను వాటిపై రాజకీయం చేయదలుచుకోలేదని అన్నారు. చంద్రబాబు వ్యూహం తమకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే ఆందోళన రాష్ట్ర బిజెపి నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందని అటున్నారు.

వైఎస్ జగన్‌కు కలిసి వస్తుందా...

వైఎస్ జగన్‌కు కలిసి వస్తుందా...

పోలవరం ప్రాజెక్టును వచ్చే ఎన్నికల్లోగా పూర్తి చేయకపోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి వ్యూహం కూడా అదే కావచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పినట్లు వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పాలని బిజెపి భావిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that BJP is in a strategy to create hurdles to Andhra Pradesh CM and Telugu Desam part chief Nara Chandrababu Naidu on Polavaram project.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X