జగన్‌ది విష ప్రచారం: 'ఆస్తులను ఈడీ ఎందుకు అటాచ్ చేసిందో చెప్పాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై వైయస్ జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనపై వైసీపీ మొదలుపెట్టిన 'గడపగడపకు వైసీపీ' కార్యక్రమాన్ని ఆయన విమర్శించారు.

రెండేళ్లుగా చేస్తున్న విష ప్రచారానికి ఇప్పుడు పేరు పెట్టుకున్నారని విమర్శించారు. ప్ర‌భుత్వంపై వైసీపీ చేస్తున్న స‌ర్వే నిరాధారం అని అన్నారు. గడపగడపకు వైసీపీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకు వెళ్లి తన ఆస్తులను ఈడీ ఎందుకు అటాచ్‌ చేసిందో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

స‌దావ‌ర్తి భూముల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన‌వ‌స‌ర‌ రాద్ధాంతం చేస్తోంద‌ని ఆయన వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తుంటే, వైయస్ జగన్ మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధిని వైసీపీ అడ్డుకోవడం సబబు కాదు.. వీలైతే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన హితవు పలికారు.

prathipati pulla rao fires on ysrcp over his new programme

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ఎవరకీ నష్టం కలిగించే కార్యక్రమం కాదని, ప్రభుత్వం సంక్షే మ పథకాలను అర్హులైన వారికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజా సాధికార స‌ర్వేలో లోపాలుంటే స‌రిచేసుకుంటామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

పుష్కరాలకు మూడున్నర కోట్ల మంది వస్తారు: దేవినేని

త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖలతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఘాట్ల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన, పిండప్రదానం, బందోబస్తు అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు.

కృష్ణా పుష్కరాలకు మూడున్నర కోట్ల మంది వస్తారని అంచనావేస్తున్నామని అన్నారు. విజయవాడకు 2 కోట్ల మంది వస్తారని, 35 పుష్కర నగర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. కృష్ణా జిల్లా పురోహితులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. పిండ ప్రదాన నిర్వహణకు అందుబాటులో 2 వేల మంది పురోహితులను నియమించామని తెలిపారు.

అందుబాటులో భక్తులకు పిండ ప్రదాన టికెట్లు, ఘాట్ల వారీ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో పుష్కరాల బందోబస్తుకు ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా 17 వేల మంది పోలీసులను సిద్ధం చేశామని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh miniter prathipati pulla rao fires on ysrcp over his new programme at guntur on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి