'విభజనతో ఏపీకి ఎంతో మేలు జరిగింది, జగన్! ఆ డైలాగ్ గుర్తు తెచ్చుకో'

Posted By:
Subscribe to Oneindia Telugu
  Andhra Pradesh Division విభజనతో ఏపీకి ఎంతో మేలు జరిగింది, జగన్! | Oneindia Telugu

  కడప: ఆంధ్రప్రదేశ్ విభజనతో రాష్ట్రానికి మేలే జరిగిందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం నాడు అన్నారు. కడప జిల్లా వేంపల్లెలో పార్టీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

  హరికృష్ణతో జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యాఖ్య, అదే నిజమైతే నిరాశే!

  విభజనతో మేలు జరిగింది

  విభజనతో మేలు జరిగింది

  విభజనతో ప్రజలకు కేవలం పది శాతం మాత్రమే నష్టం జరిగిందని, 90 శాతం లాభం చేకూరుందని రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన జరుగకముందు రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేదని, విభజన తర్వాత 13 జిల్లాల ఏపీకి రూ.1.30 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు.

  ఇలా లాభం.. విమర్శించొద్దు

  ఇలా లాభం.. విమర్శించొద్దు

  విభజన వల్ల అటు తెలంగాణ రాష్ట్రానికి, ఇటు ఏపీకి ఎంతో మేలు జరిగిందని రఘువీరా రెడ్డి చెప్పారు. ఇరురాష్ట్రాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పరిపాలనలో వైఫల్యం చెంది కాంగ్రెస్ అడ్డగోలుగా విభజన చేసిందని విమర్శించడం సరికాదన్నారు.

  జగన్ హోదా గురించి మాట్లాడటమా?

  జగన్ హోదా గురించి మాట్లాడటమా?

  ప్రత్యేక హోదా గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని రఘువీరా రెడ్డి అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలపై పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తాము సమీక్షిస్తామన్నారు. త్వరలో పిసిసి నూతన కార్యవర్గం ఎంపిక జరుగుతుందని చెప్పారు.

  జగన్! ఆ డైలాగ్ గుర్తు చేసుకో

  జగన్! ఆ డైలాగ్ గుర్తు చేసుకో

  పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తామని రఘువీరా చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకమని చెప్పారు. గతంలో బిజెపితో పొత్తు ప్రసక్తేలేదన్న జగన్ ప్రస్తుతం ఆ పార్టీతో జతకట్టేందుకు ఉవ్వీళ్లూరుతున్నారని చెప్పారు. మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే చెప్పే డైలాగును ఆయన గుర్తు చేసుకోవాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Congress chief Raghuveera Reddy interesting comments on Andhra Pradesh division. He suggested Telugu Desam and YSR Congress not to criticise Congress for division.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి