హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కబ్జాదారులకు ప్రాణాలు బలి: కెసిఆర్‌కు వినతి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కబ్జాదారుల వేధింపులు తాళలేక ఓ ఆర్టీసీ ఉద్యోగి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మెడలోని బంగారు గొలుసుతో సహా అన్నీ తాకట్టు పెట్టి ప్లాటు కొనుగోలు చేస్తే కబ్జాదారులు వచ్చి ప్లాట్‌ తమదేనంటూ బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సూసైడ్‌నోట్‌ రాసి ఉరివేసుకున్నాడు.

సికింద్రాబాద్‌లోని ఇమ్లిబన్‌లో సిస్టమ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఆర్‌.రమేష్‌ (39) భార్య మాధవితో కలిసి దిల్‌షుక్‌నగర్‌లోని పీ అండ్‌ టీ కాలనీలోని కోదండరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తానుంటున్న ఇంటి పక్కనే డాక్టర్‌ వసంత్‌కుమార్‌కు చెందిన 291 గజాల ఖాళీ ప్లాట్‌ను కొనుగోలు చేయాలనుకున్నాడు. తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో సోదరుడు రమేష్‌, సోదరి జ్యోతితో కలిసి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ఇటీవల మృతిచెందడంతో అతని భార్య రాధిక, వారసుల (లీగల్‌ హేర్స్‌) వద్ద నుంచి రమేష్‌, సురేష్‌, జ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. భూకబ్జాదారులు రంగప్రవేశం చేసి జిహెచ్ఎంసి అధికారులతో తోడ్పాటుతో రమేష్‌ను వేధించడం ప్రారంభించారు. దాంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. జిహెచ్ఎంసిలో అవినీతిని అరికట్టాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని అతను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కోరారు. అతని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితిని చదవండి.

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

కొనుగోలు చేసిన స్థలంలో నెల రోజుల క్రితం ఇంటి నిర్మాణ పనులు రమేష్ చేపట్టగా దూసరి శ్యామ్‌కుమార్‌గౌడ్‌ అనే వ్యక్తి సహచరులు డి.శ్రీహరి, జహంగీర్‌తో అక్కడికి వచ్చి నిర్మాణం ఎలా చేపడతారంటూ పనుల్ని అడ్డుకున్నాడు. ప్లాట్‌ పత్రాలు చూపించాలని రమేష్‌ కోరగా బెదిరించారు.

ఆర్టిసి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్టిసి ఉద్యోగి ఆత్మహత్య

అప్పటినుంచి రోజూ ఫోన్లు చేసి మానసికంగా వేధిస్తున్నారు. ఈ నెల 5న శ్యామ్‌కుమార్‌గౌడ్‌, శ్రీహరి, జహంగీర్‌ మరో 15 మందితో పాటు జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ టీపీఎస్‌ మన్సూర్‌, చైన్‌మన్‌ యాదయ్యను తీసుకుని ప్లాట్‌ వద్దకు వచ్చి హంగామా చేశారు.

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

రమేష్‌ కుటుంబసభ్యులను బెదిరించి వారి వద్ద ప్లాట్‌ రిజిస్ర్టేషన్‌ పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్ల జిరాక్స్‌ ప్రతులను బలవంతంగా తీసుకెళ్లారు. ప్లాట్‌ జిరాక్స్‌ పత్రాలు తీసుకెళ్లినప్పటి నుంచి సెటిల్‌మెంట్‌ చేసుకోవాలంటూ ఒత్తిడి తేసాగారు. ఈ క్రమంలో శ్యామ్‌కుమార్‌గౌడ్‌ 13వ తేదీ రమేష్‌కు ఫోన్‌ చేసి రామంతాపూర్‌ రావాలని సూచించాడు.

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

రమేష్‌ తన సోదరుడు సురేష్‌, చెల్లెలు జ్యోతి, ఆమె భర్త శ్రీహరి, స్నేహితుడు మధుతో కలిసి రామంతాపూర్‌ వెళ్లాడు. అప్పటికే పదుల సంఖ్యలో అనుచరులతో ఉన్న శ్యామ్‌కుమార్‌గౌడ్‌ రమేష్‌ను ప్లాట్‌లో సగభాగం ఇస్తేనే వివాదం సద్దుమణుగుతుందని, లేకుంటే అసలుకే మోసం వస్తుందంటూ బెదిరించి, భయభ్రాంతులకు గురిచేశాడు.

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

చివరకు పెద్దమనుషులు జోక్యం చేసుకోగా రూ.15 లక్షలు ఇవ్వాలని శ్యామ్‌కుమార్‌ పట్టుబట్టాడు. డబ్బులు ఇవ్వలేనని రమేష్‌ నిస్సహాయత వ్యక్తం చేశాడు. చివరకు రూ.8 లక్షలు ఇవ్వాలంటూ శ్యామ్‌కుమార్‌గౌడ్‌ తేల్చిచెప్పాడు. గత్యంతరం లేని స్థితిలో రమేష్‌ అప్పటికప్పుడు రూ.40 వేలు తీసుకొచ్చి ఇచ్చాడు.

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

శాంతించని శ్యామ్‌కుమార్‌ రమేష్‌తో బలవంతంగా అగ్రిమెంట్‌ రాయించుకున్నాడు. ఈ సంఘటనపై మనస్తాపం చెందిన రమేష్‌ సూసైడ్‌నోట్‌ రాసి సోమవారం తెల్లవారుజామున ఇంట్లోని గదిలో ఉరివేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్య

శ్యామ్‌కుమార్‌గౌడ్‌, అతడి అనుచరుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌నోట్‌లో రమేష్‌ పేర్కొన్నాడు. తనను వేధించిన వారిపై చర్య తీసుకోవాలని కోరాడు. ఆర్టీసీ తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు. జీహెచ్‌ఎంసీలో అవినీతిని నిర్మూలించాలని, తన కుటుంబసభ్యులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాడు.

English summary
An RTC worker at Disukhnagar in Hyderabad has commited suicide due to harassement of land grabbers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X