హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళన: ఎటిఎం కేంద్రాల వద్ద రద్దీ

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లధనం నిరోధానికి ప్రధాని మోదీ శ్రీకారం చూట్టారు. అందులో భాగంగా రూ.500, 100 నోట్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. బుధవారం బ్యాంక్ సేవలతోపాటు ఏటీఎంలు కూదా పనిచేయవని మోదీ పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఏటీఎం కేంద్రాల వద్ద వినియోగదారులు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏటీఎం సెంటర్ల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేయడంతో రూ.100 నోట్లు ఎక్కువగా తీసుకునేలా ఏటీఎంలలో మళ్లీ మళ్లీ కార్డులు పెట్టి వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు. పలుచోట్ల ఏటీఎంలలో డబులు అయిపోవడంతో వినియోగదారులు ఇబ్దందులు పడుతున్నారు.

మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ నోట్లు కేవలం కాగితాలుగా మారాయి. ఈ నేపధ్యంలో 500, వెయ్యి రూపాయలు ఉన్న ప్రజలు ఆ నోట్లను ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నల్ల కుబేరులపై మోదీ ఉక్కుపాదం మోపారని పలువురు అభివర్ణించారు. మోదీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్వం వ్యక్తం అవుతోంది. మరోవైపు రూ.500, వెయ్యి నోట్ల రద్దు కావడంతో రూ.100, 50 నోట్ల భారీ డిమాండ్ పెరిగింది. అయితే మార్కెట్లలో ఎక్కువగా పెద్ద నోట్ల చలామణి అవుతుండడంతో వంద, యాబై నోట్ల దొరకని పరిస్థితి నెలకొంది. తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వెంటనే ఖర్చు చేసి చిల్లర తీసుకుంటున్నారు. మరోవైపు ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను పెట్రోలు బంకుల్లో స్వీకరిస్తున్నప్పటికీ, వారి వద్ద వంద నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు బంకులను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బంకుల్లోకి వస్తున్న వారు రూ. 1000 నోటిచ్చి వంద లేదా రెండొందలకు పెట్రోలు కొట్టమని అడుగుతుంటే, మిగతా చిల్లర ఇచ్చుకోలేక బంకుల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పెట్రోల్ బంక్ అసోసియేషన్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ స్పందిస్తూ, వాహనదారులు రూ. 500కు పెట్రోలు కొట్టించుకోవాలని సలహా ఇచ్చారు. బంకులకు వచ్చి చిల్లర మాత్రం అడగవద్దని చెప్పిన ఆయన, బంకుల సిబ్బంది సైతం తమ సమస్య చెప్పి కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కోరారు.

English summary
Rush is seen at ATM centres in Hyderabad following the annpuncement of PM Narendra Modi on the ban of Rs 500 and 1000 notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X