వేషము మార్చెను: ఆనం వివేకాను చూసి ఫ్యాన్స్ స్టన్
Recommended Video

ఆనం వివేకానందరెడ్డి...రాజకీయాల గురించి ఏమాత్రం తెలిసినవారైనా వెంటనే గుర్తుపట్టగలిగిన నేత...సొంత జిల్లా నెల్లూరు అయినా తన ప్రత్యేక మేనరిజంతో రాష్ట్రమంతా సుపరిచితంగా మారారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు... ఒక్కమాటలో చెప్పాలంటే నా రూటే సపరేటు అని ఆనం వివేకా అన్నా అనకున్నా ఆయన గురించి తెలిసిన వారెవరైనా ఏకగ్రీవంగా ఆయనకు తగిలించే ట్యాగ్ లైన్ ఇదే...
ఆనం తనదైన శైలిలో విసిరే నెల్లూరు యాసతో విసిరే పంచ్ డైలాగ్ లు , ప్రత్యేకంగా ఉండే వేషభాషలు, విచిత్రమైన మ్యానరిజం...తప్పయినా ఒప్పయినా బహిరంగంగానే చేసే తెంపరితనం...ఇలా ఇన్ని స్పెషాలిటీలు ఆనం వివేకానందరెడ్డి కే సొంతమనడంలో ఎలాంటి సందేహం లేదు...మాటలను తూటాల్లా పేల్చే ఆనం వివేకానందరెడ్డి తన స్వభావానికి విరుద్దంగా మౌనంగా ఉంటే చూసినవాళ్లు ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం.. ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయ నేతల పరిస్థితి అదే...
ఆనం వివేకానందరెడ్డి అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇటీవలే తన తల్లి మృతిచెందడంతో ఆనం వివేకా నెల్లూరుకు వచ్చారు. అలా వచ్చిన ఆనం వివేకానందరెడ్డిని చూసిన ఆయన అనుచరులు,అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారట.

కారణం అంతకు ముందు ఆనం కు ఇప్పడు తాము చూస్తున్న ఆనం కు చాలా తేడా ఉండటంతో అసలు తాము చూస్తున్నది ఆయన నేనా అని ఆశ్చర్యపోతున్నారట. గతంలో కంటే చాలా సన్నబడిన ఆనం వివేకా, నవ్వుతూ తుళ్లుతూ ఉండే తన స్వభావానికి భిన్నంగా గంభీరంగా ఉండటం కూడా వారిని చాలా ఆశ్చర్యపరిచిందట. మరోరకంగా చెప్పాలంటే ఫుల్ గ్లామర్ తో హల్చల్ చేసే ఆనం ఇప్పుడు కళ తగ్గి డీ గ్లామర్ గా కనిపిస్తున్నారట.
ఏదేమైనా ఆనం వివేకానందరెడ్డిని అప్పటివరకు ఒకలా చూసినా ఆయన అనుచరులు,అభిమానులు ఇప్పుడు ఇలా కనిపిస్తున్న ఆనం ను చూసి చాలా బాధపడుతున్నారట. అయితే ఆనం నెల్లూరులో కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్లీ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లిపోతారట. తమ అభిమాన నాయకుడు అనారోగ్యం నుంచి బైటపడి వచ్చే ఎన్నికల నాటికి పూర్తి జోష్ తో పాత ఆనం వివేకాలా తిరిగిరావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications