హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోటల్లో టెక్కీ ఆత్మహత్య, విద్యార్థినిపై రేప్ కేసులో అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Software Engineer commits suicide in Hyderabad
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ హోటల్‌లో సాఫ్టువేర్ ఇంజనీర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాదులోని ఓ హోటల్‌లో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆయన పేరు కృష్ణా రెడ్డిగా తెలుస్తోంది.

టెన్త్‌ విద్యార్థిపై అత్యాచారం కేసులో అరెస్ట్‌

అనంతపురం జిల్లాలోని కదిరిలో మూడు నెలలుగా టెన్త్‌ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు ఇలియాజ్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇలియాజ్‌ను కఠినంగా శిక్షించాలంటూ కదిరి అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.

కర్నూలు జెడ్పీ చైర్మన్‌పై నకిలీ మద్యం కేసు

కర్నూలు జిల్లాలో సుమారు రూ.12లక్షలు విలువ చేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముందుగా తోటలోని వాచ్‌మెన్ పైన కేసు నమోదు చేశారు. వాచ్‌మెన్‌ను విచారించగా డోన్‌ ఎంపీపీ కుమారుడు, ఉడుమలపాడు గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్ గౌడ్‌ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఈ కేసు విచారణకై ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌‌ను నియమించారు.

నకిలీ మద్యం వ్యాపారంలో జెడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌ ప్రధాన సూత్రధారిగా ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. ఈ కేసులో రాజశేఖర్, ఆయన సహాయకుడి పైన ఎక్సైజ్ శాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం వ్యాపారంలో రాజశేఖర్‌ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే అరెస్ట్‌ ఆయనను చేస్తామని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో డోన్‌ ఎంపీపీ కుమారుడు రామన్ గౌడ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ నెల 2న డోన్‌ మండలంలోని కొత్తకోట హైవే పక్కన ఓ తోటలో నకిలీ మద్యం డంప్‌ భారీగా బయటపడింది. దాదాపు పన్నెండు లక్షల విలువ చేసే 15,300 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సుల్తాన్‌బజార్‌లో దొంగల బీభత్సం

హైదరాబాద్ నగరంలోని సుల్తాన్‌బజార్‌లో మంగళవారం రాత్రి దోపిడీ దొంగలు ఓ వ్యాపారిపై దాడి చేసి దాదాపు 3 లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. దాడి సందర్భంగా దుకాణం యజమానితోపాటు అతని కుమారుడు గాయపడ్డాడు.

English summary
Software Engineer commists suicide in Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X