తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలిపిరి వద్ద 500గదులతో వసతి గృహం: టీటీడీ కీలక నిర్ణయాలివే

|
Google Oneindia TeluguNews

తిరుపతి: మంగళవారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు పరకామణి విధులు వేయకూడదని, మూడేళ్లు దాటి తిరుమలలో పనిచేస్తున్నవారిని తిరుపతికి బదిలీ చేయాలని నిర్ణయించారు.

టీటీడీ ఉద్యోగులు ఆగస్టు మాసంలో కొన్ని సమస్యలు పరిష్కరించాలని టీటీడీ పాలక మండలికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ వారి సమస్యలపై ఉద్యోగులతో చర్చించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

500గదులతో వసతి గృహం

500గదులతో వసతి గృహం

అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.
తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు టీటీడీ బోర్డు ఎఫ్ఎంఎస్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ఇందుకు రూ.112కోట్లు ఖర్చు చేయనుంది. టీటీడీలోని రెగ్యూలర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

కళాశాలల్లో సీట్ల పెంపు

కళాశాలల్లో సీట్ల పెంపు

టీటీడీ విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందికి పదవీ విరమణ లేదా మరణించిన సందర్భాలలో ఆర్జిత సెలవు(ఎర్న్‌డ్ లీవ్), అర్థ వేతన సెలవుల నగదు మార్పిడికి సంబంధించిన జీవో నెం. 90అమలు చేసేందుకు నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువగా ఉన్న గ్రూపుల్లో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం తెలిపారు.

పరకామణి డిప్యూటేషన్ విధులు రద్దు

పరకామణి డిప్యూటేషన్ విధులు రద్దు

టీటీడీ సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి డిప్యూటేషన్ విధులను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఫారిన్ సర్వీసు నుంచి టీటీడీకి వచ్చిన ఉద్యోగులను 3సంవత్సరాల కాలపరిమితి అయిన తర్వాత మాతృ సంస్థకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఒక్కసారి వచ్చిన వారిని రెండోసారి విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.

ఒకేచోట మూడేళ్లుంటే బదిలీనే..

ఒకేచోట మూడేళ్లుంటే బదిలీనే..

ఒకే చోట మూడేళ్లపాటు విధులు నిర్వహించిన టీటీడీ ఉద్యోగులను మరో విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నవంబర్ 1నుంచి అమల్లోకి రానుంది. కాగా, ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ డా. ఎం పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు సుధా నారాయణమూర్తి, రాయపాటి సాంబశివరావు, బోండా ఉమామహేశ్వరరావు, ఇ పెద్దిరెడ్డి, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, చల్లా రమచంద్రారెడ్డి, బీకే పార్థసారథి, శివాజీ, సండ్ర వెంకటవీరయ్య, డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు కే రాఘవేంద్రరావు, శ్రీకృష్ణ, తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

English summary
The Tirumala Tirupati Devasthanams Board in its board meeting held under the chairmanship of Sri Putta Sudhakar Yadav at Annamaiah Bhavan in Tirumala has taken some important decisions on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X