సస్పెండైనా పోరాడండి, విశ్వాసం అంటూనే అవిశ్వాసమా? వైసీపీని ఏకేసీన బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
  మోడీపై విశ్వాసం ఉంటే రాజీనామాలు, అవిశ్వాసం ఎందుకు ?

  అమరావతి: ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాటం కొనసాగించాలని టిడిపి ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారు. సభ నుండి సస్పెన్షన్‌కు గురైనా  వెనుకంజ వేయొద్దని చెప్పారు. 

  పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని కేంద్రానికి తెలిసేలా చేయాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు.

  వైసీపీ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తోందనే విషయాలను వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంపై విశ్వాసం ఉందని చెబుతూనే అవిశ్వాసం పెడతామనే వైసీపీ నాటకాలను ప్రజలకు వివరించాలని బాబు చెప్పారు. 

   సస్పెండైన వెనుకంజ వేయొద్దు

  సస్పెండైన వెనుకంజ వేయొద్దు

  పార్లమెంట్‌లో ఏపీ రాష్ట్రానికి న్యాయయం జరిగే వరకు పోరాటాన్ని కొనసగించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. ఏపీకి ఇచ్చిన హమీల అమలులో ఏ రకంగా అన్యాయం చేశారనే విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బాబు సూచించారు. రాష్ట్రానికి న్యాయం కోసం ఇతర పార్టీల నేతలతో కలిసి పోరాటం చేయాలన్నారు.

   విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తావించిన బాబు

  విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తావించిన బాబు

  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఎంపీలతో ప్రస్తావించారు. కేంద్రంపై, ప్రధానమంత్రిపై తమకు విశ్వాసం ఉందని విజయసాయిరెడ్డి అన్నట్టుగా మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను బాబు ఎంపీలతో ప్రస్తావించారు. మోడీపై విశ్వాసం ఉంటే ఎంపీలతో ఎందుకు రాజీనామాలు చేయాలని భావిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంపై ఎందుకు అవిశ్వాసం పెట్టాలని ముందుకువచ్చారో చెప్పాలన్నారు.

   కేంద్ర మంత్రులకు సభలో మాట్లాడాలని బాబు సూచన

  కేంద్ర మంత్రులకు సభలో మాట్లాడాలని బాబు సూచన

  కేంద్ర ప్రభుత్వం నుండి ఎందుకు వైదొలగాల్సి వచ్చిందనే విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాజీ కేంద్ర మంత్రులు ఆశోక్ ‌గజపతి రాజు, సుజనాచౌదరిలకు సూచించారు. కేంద్రం నుండి వైదొలగాల్సిన పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంట్‌లో వివరించాలని బాబు సూచించారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభల్లో ఇద్దరు మాజీ కేంద్రమంత్రులు తమ రాజీనామాలకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నోటీసులిచ్చారు.

   కేంద్రంపై ఒత్తిడికి టిడిపి ప్రయత్నాలు

  కేంద్రంపై ఒత్తిడికి టిడిపి ప్రయత్నాలు

  ఏపీ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు టిడిపికి కొంత ఇబ్బందిగా పరిణమించాయి. అయితే కేంద్రం నుండి మంత్రులు వైదొలగడంతో టిడిపి రాజకీయంగా కొంత పై చేయి సాధించినట్టుగా కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏపీ రాష్ట్రానికి నిధుల విడుదల, ప్రత్యేక హోదా అంశంపై ఇచ్చిన హమీలను నిలుపుకోవాలని టిడిపి కేంద్రంపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనల హోరును పెంచాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tdp chief Chandrababu Naidu ordered to party leaders to continuing protest in parliament for Ap special status. Chandrababu naidu conducted teleconference on Monday morning.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి