రాంచరణ్ ‘ట్రూజె‌ట్’ కనెక్టింగ్ ఇండియా ఆఫర్ ఇదే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యువ కథానాయకుడు రాంచరణ్ తేజ భాగస్వామిగా పౌర విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన 'ట్రూజెట్ ఎయిర్‌వేస్' సంస్థకు జులై 12తో ఏడాది పూర్తైంది. ఈ క్రమంలో మంగళవారం తొలి వార్షికోత్సవ వేడుకలను ఆ సంస్థ నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో 'కనెక్టింగ్ ఇండియా ఆఫర్' పేరిట ఆ సంస్థ కొత్త ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. గత సంవత్సరం జులై 12న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చెర్రీ ఫ్లైట్స్ ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత రెండు మార్గాల్లోనే విమానాలను నడిపిన ట్రూజెట్... ప్రస్తుతం 5 మార్గాల్లో విమానాలను నడుపుతోంది.

 Trujet to celebrate first anniversary

విజయవాడ-కడప-విజయవాడ, చెన్నై-కడప-చెన్నై, హైదరాబాగ్-కడప- హైదరాబాదు, కడప-తిరుపతి, హైదరాబాగ్-ఔరంగాబాదు మార్గాల్లో ప్రస్తుతం ట్రూజెట్ విమానాలు సేవలందిస్తున్నాయి.

కాగా, తొలి వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన 'కనెక్టింగ్ ఇండియా ఆఫర్' ద్వారా ట్రూజెట్, లేదా ఏదేనీ ఇతర ఎయిర్ లైన్స్ లో అదే రోజుల ప్రయాణించిన ప్రయాణికులకు రూ.500 విలువ కలిగిన వోచర్‌ను ఆ సంస్థ అందించనున్నట్లు పేర్కొంది. తాను సేవలందిస్తున్న ప్రాంతాలతో దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Regional airliner Trujet is celebrating its first anniversary of operations on July 12.The Hyderabad-based airliner started its first commercial flight during the Godavari Pushkaralu, one year ago on July 12, 2015 with a special inaugural schedule.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి