బాబుకు కేంద్రం షాక్: పోలవరం అంచనా పెరిగితే.. రాష్ట్రమే భరించాలి!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పోలవరం అంచనా వ్యయం పెరిగితే కేంద్రం దాన్ని భరించలేదని, ఆ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. 2014, ఏప్రిల్ లో కేంద్రానికి పంపించిన అంచనా వ్యయాన్నే పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వానికి ఇది కచ్చితంగా షాక్ అని చెప్పాలి.

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కేంద్రం పర్యవేక్షణలోనే జరగాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు నిర్మాణ బాధ్యతలను కేంద్రం చంద్రబాబు సర్కార్ కే కట్టబెట్టింది. ఇక ఆ తర్వాత ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచిన ప్రభుత్వం మొత్తం రూ.40,351.65కోట్ల లెక్క చూపిస్తూ ప్రతిపాదనలు పంపించింది.

రాష్ట్ర ప్రభుత్వ అంచనా వ్యయం:

రాష్ట్ర ప్రభుత్వ అంచనా వ్యయం:

ప్రతీ ఏటా ధరల పెరుగుదల వల్ల 2019నాటికి ఈ అంచనా వ్యయం రూ.42వేల కోట్లకు చేరుకుంటుందని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. అదే సమయంలో ఏప్రిల్1, 2014నుంచి ఫిబ్రవరి ఆఖరు నాటికి రూ.3762.52కోట్లను ప్రాజెక్టుపై ఖర్చు పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

కేంద్రం కొలికి:

కేంద్రం కొలికి:

తాజాగా కేంద్రమంత్రి ఉమాభారతి ఏప్రిల్1,2014 నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే కేంద్రం భరిస్తుందని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవిపి రామచంద్రరావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఉమాభారతి ఈవిధంగా బదులిచ్చారు.

అంచనా పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత:

అంచనా పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత:

2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థికశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం 2014ఏప్రిల్ 1నుంచి పోలవరం సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును 100శాతం కేంద్రమే భరిస్తుందని ఉమాభారతి అన్నారు. అయితే ఆరోజుకు సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తుందని చెప్పడం గమనార్హం. అంచనా వ్యయం పెరిగితే.. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.

కేటాయింపులు తక్కువే!

కేటాయింపులు తక్కువే!

ఇదిలా ఉంటే, 2017-18 కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.9కోట్లు మాత్రమే దక్కాయి. ఓవైపు కేంద్రం నుంచి ఇంత తక్కువగా నిధులు విడుదలవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2019నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెబుతుండటం గమనార్హం.2014, ఏప్రిల్ 1వరకు చేసిన ఖర్చును రీయింబర్స్ మెంట్ చేస్తామని, ఆ నిధులను కూడా నాబార్డు ద్వారా ఇప్పిస్తామని పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Central minister Uma Bharati was very clearly said that if the estimation expenditure of Polavaram will increase central never gives extra funds
Please Wait while comments are loading...