అక్రమాలపై ఫిర్యాదు: సత్యనారాయణపై కూరగాయల వ్యాపారుల దాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: కూరగాయల మార్కెట్లో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసిన కారణంగా సత్యనారాయణ అనే వ్యక్తిపై కూరగాయల వ్యాపారులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు.

తిరుపతి కూరగాయల మార్కెట్లో నిబంధనలకు విరుద్దంగా కొందరు దుకాణలు ఏర్పాటు చేశారని సత్యనారాయణ అనే వ్యక్తి మున్సిఫల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆదారంగా అధికారులు కూరగాయల మార్కెట్‌లోని అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించారు.

Vegetable merchants attacked on Satyanarayana in Tirupati

దీంతో కక్షగట్టిన కూరగాయల వ్యాపారులు సత్యనారాయణపై మున్పిఫల్ కార్యాలయం ఎదుటే చావబాదారు. స్థానికులు వెంటనే సత్యనారాయణను రుయా ఆసుపత్రికి తరలించారు.అనుమతి లేకుండా కూరగాయల దుకాణాలు నిర్వహిస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చిన పాపానికి దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vegetable merchants attacked on Satyanarayana on Wedneday at Tirupati. Satyanarayana complaint against illegal shops in vegetable shops in market

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి