Vijayawada Traffic: విజయవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపులు- ఏయే రూట్లలో, ఎలా..!

విజయవాడలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. రేపు దసరా శరన్నవరాత్రులు 2026 ముగింపు ఉత్సవాల "మెగా కార్నివాల్" కార్యక్రమం ఏలూరు రోడ్డు లో జరగబోతోంది. SRR కాలేజీ నుండి చుట్టుగుంట సిగ్నల్ జంక్షన్ మీదుగా విశాలాంధ్ర రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగే ఈ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు (Vijayawada Traffic Diversions ) చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు.

ఏబీ వెంకటేశ్వరరావు వెనుక చంద్రబాబు? సాయిరెడ్డికి కేశినేని కౌంటర్..!
ఏబీ వెంకటేశ్వరరావు వెనుక చంద్రబాబు? సాయిరెడ్డికి కేశినేని కౌంటర్..!

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు స్ధానిక ప్రజాప్రతినిధులు, నేతలు, స్ధానికులు భారీ ఎత్తున తరలివస్తారని అంచనా వేస్తున్న పోలీసులు. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి నగరంలో పాక్షికంగా సిటీ బస్సుల మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి పూర్తిగా బస్సుల్ని మళ్లిస్తారు. రామవరప్పాడు రింగ్ నుండి ఏలూరు రోడ్డు లో వచ్చే ఆర్టీసీ బస్సులను పడవలరేవు జంక్షన్ , బీఆర్టీఎస్ రోడ్డు, సీతన్నపేట గేటు లెఫ్ట్ టర్న్, ఏలూరు లాకులు, నారాయణ స్వామి హోటల్, పాత కేశినేని ట్రావెల్స్, స్వర్ణ ప్యాలెస్ రైట్ టర్న్, పీసీఆర్ జంక్షన్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్ కు మళ్లిస్తారు.

Vijayawada Traffic Diversions Tomorrow for Dussehra Mega Carnival Check Routes
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!

అలాగే బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డులోకి వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని పీసీఆర్ జంక్షన్, స్వర్ణ ప్యాలెస్ లెఫ్ట్ టర్న్,పాత కేశినేని ట్రావెల్స్, నారాయణ స్వామి హోటల్, ఏలూరు లాకులు, సీతన్నపేట గేట్ రైట్ టర్న్, బీఆర్టీఎస్ రోడ్డు, పడవలరేవు జంక్షన్ మీదుగా రామవరప్పాడు రింగ్ వైపుకు మళ్లిస్తారు. లేదా బస్టాండ్ నుంచి పీసీఆర్ జంక్షన్, ఆర్టీసీ వై జంక్షన్, బందరు రోడ్డు, బెంజిసర్కిల్, మహానాడు రోడ్డు మీదుగా రామవరప్పాడువైపుకు మళ్లిస్తారు. నగరంలో కార్లు, టూవీలర్లు, ఇతర వాహనాలను మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ పూర్తిగా మళ్లిస్తారు. ఏలూరు రోడ్డులో దీప్తి జంక్షన్ నుండి పడవలరేవు జంక్షన్ వరకు ఈ సమయంలో వాహనాల్ని పూర్తిగా అనుమతించరు. కాబట్టి దసరా మెగా కార్నివాల్" కార్యక్రమం సందర్భముగా ట్రాఫిక్ అవాంతరాలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నగర ప్రజలందరు తమ వాహనాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+